Chatrapathi Hindi Hindi day 1 collections నిరాశపరిచిన హిందీ ఛత్రపతి కలెక్షన్లు..
తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తొలిసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి అదే టైటిల్‌తో ఉత్తర భారతం ప్రేక్షకుల ముందుకు వచ్చి హీరోగా పరిచయం అయ్యారు. అయితే ఛత్రపతి లాంటి సినిమాను రీమేక్ చేయడం భారీ సాహసం అయినప్పటికీ.. హిందీ ఛత్రపతి టీజర్లు, ట్రైలర్లు కొంత ఆసక్తిని రేపాయి. అయితే మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
50 కోట్లు.. 2000 స్క్రీన్ ప్రజెన్స్ : బెల్లంకొండ శ్రీనివాస్, నుస్రత్ బరుచా, శరద్ కేల్కర్, భాగ్యశ్రీ, పట్వర్ధన్, ఫ్రెడ్డీ దారువాలా తదితరులు నటించిన ఛత్రపతి హిందీ రీమేక్ మూవీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా బడ్జెట్ అన్ని వ్యయాలతో కలిపి 50 కోట్లుగా విలువ కట్టారు. ఇక పెన్ మీడియా లిమిటెడ్ ఈ సినిమాను భారీగా రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాను 2000 వేల స్క్రీన్లలో రిలీజ్ చేయగా, ఓవర్సీస్‌లో మొత్తంగా 300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాను 2300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

బ్రేక్ ఈవెన్ భారీగా : బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమైన బెల్లంకొండ శ్రీనివాస్‌కు హిందీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల లక్ష్యం భారీగానే ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 55 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. దాదాపు ఈ చిత్రం 75 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. అయితే తొలి రోజు కలెక్షన్లు మాత్రం భారీగా నిరాశనే కలిగించాయనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నారు.

యూట్యూబ్ క్రేజ్.. థియేటర్‌కు : హిందీ ఛత్రపతి మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించడంతో మంచి స్పందన ఉంటుందని ఊహించారు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్‌కు యూట్యూబ్‌లో ఉన్న క్రేజ్ థియేటర్‌కు కన్వర్ట్ కాలేదనే విషయం తాజా ఆక్యుపెన్సీతో స్పష్టమైంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఎండలను లెక్క చేయకుండా ప్రమోషన్ చేసినప్పటికీ.. ఒపెనింగ్స్ సరిగా లేకపోవడం నిరాశను కలిగిస్తున్నది.

ఫస్ట్ డే ఆక్యుపెన్సీ ఇలా : హిందీ ఛత్రపతి మూవీ తొలి రోజు ఆక్యుపెన్సీ చాలా పూర్‌గా నమోదైంది. మార్నింగ్ షోకు 10 శాతం కంటే తక్కువ, మ్యాట్నీకి 15 కంటే తక్కువగానే నమోదైంది. ఇక ఫస్ట్ షో, సెకండ్ షోలకు కొంత మెరుగ్గా ఆక్యుపెన్సీ కనిపించింది. ఫస్ట్, సెకండ్ షోకు సుమారు 15 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే : హిందీ ఛత్రపతి సినిమా తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. అంచనాలకు కనీసం దగ్గరగా కూడా కనిపించలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా ఇండియా వైడ్ తొలి రోజు 60 లక్షల రూపాయల కలెక్షన్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్‌లో 10 లక్షల మేర వసూళ్లు రాబట్టింది. దాంతో తొలి రోజు 70 లక్షల రూపాయలు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.



Click it and Unblock the Notifications











