Check 7 days collections: వారం గడిచినా మారని పరిస్థితి.. ఇంకా ఎంత రావాలంటే?

భీష్మ సినిమా కంటే ముందు వరకు కొన్ని డిజాస్టర్స్ ఎదుర్కొన్న నితిన్ పూర్తిగా కమర్షియల్ సినిమాలను పట్టించుకోకుండా కాస్త ప్రయోగాలు కూడా చేయాలని డిసైడ్ అయ్యాడు. భీష్మ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా ఇచ్చిన ఎనర్జీతోనే చెక్ సినిమాను చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేశాడు. అయితే ఆ సినిమా కలెక్షన్స్ ఊహించని విధంగా వచ్చాయి. మొత్తానికి ఒక వారం పూర్తయ్యింది. కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

Recommended Video

Nithin And Check Cast Hilarious Interview With Srimukhi
మిక్సీడ్ టాక్ తో చెక్

మిక్సీడ్ టాక్ తో చెక్

ఐతే సినిమా నుంచి మొదలుకొని మనమంతా సినిమా వరకు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చేసిన ప్రయోగాలకు ప్రశంసలు ఏ రేంజ్ లో వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే కమర్షియల్ గా మాత్రం ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ అందుకోలేవు. అయితే చెక్ సినిమాతో చంద్రశేఖర్ యేలేటి ఈసారి తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఎదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడని టాక్ గట్టిగానే వచ్చింది. ట్రైలర్ తోనే ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలును పెంచిన సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్సీడ్ టాక్ తో వెలుతోంది.

రెండవ రోజు నుంచి..

రెండవ రోజు నుంచి..

సినిమా పెట్టిన పెట్టుబడిలో ఇప్పటివరకు సగమే వసూలు చేసింది. లాభాల్లోకి రావాలంటే మరో సగం రావాల్సిందే. మొదటి రోజు నుంచి కూడా కలెక్షన్స్ అనుకున్నంత రేంజ్ లో ఏమి రాలేవు. మొదటి రోజు 3.38కోట్ల షేర్స్ మాత్రమే అందుకున్న చెక్ ఆ మరుసటి రోజు నుంచి రెండు కోట్ల షేర్స్ ను కూడా అందుకోలేకపోయింది. అప్పటి నుంచి 7వ రోజు వరకు కూడా తగ్గుతూనే వస్తున్నాయి.

7 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్

7 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్

తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు కూడా సినిమా కలెక్షన్స్ చాలా తగ్గిపోయాయి. నైజాం 2లక్షలు, సీడెడ్ 1లక్షలు, ఉత్తరాంధ్ర 2లక్షలు, ఈస్ట్ 1.2లక్షలు, వెస్ట్ 1లక్షలు, గుంటూరు 1లక్షలు, కృష్ణా 2, 1లక్షలు, నెల్లూరు 0.6లక్షలు. ఏపీ తెలంగాణలో 6వ రోజు చెక్ సినిమాకు వచ్చిన మొత్తం షేర్స్ 0.10కోట్లు. గ్రాస్ 0.18కోట్లు

నష్టాలు రాకుండా ఉండాలంటే..

నష్టాలు రాకుండా ఉండాలంటే..

7 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 8.02కోట్ల షేర్స్ మాత్రమే అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చిన షేర్స్ 9.01కోట్లు. ఈ సినిమా బాక్సాఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16.5 కోట్లు. ప్రాఫిట్స్ లోకి వస్తుందో రాదో తెలియదు గాని నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఇంకా 7.47కోట్లను రాబట్టాలి. అయితే డే బై డే మాత్రం కలెక్షన్స్ భారీగా తగ్గుతున్నాయి. మరోవైపు కొత్త సినిమాలు కూడా విడుదలయ్యాయి. మరి నితిన్ చెక్ మిగిలిన రోజుల్లో ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X