twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమానే నెం.1, టాప్ 5 సినిమాల లిస్ట్!(పిక్చర్స్)

    By Bojja Kumar
    |

    ముంబై : నిన్న మొన్నటి వరకు నెం.1 మూవీగా ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్న అమీర్ ఖాన్ '3 ఇడియట్స్' మూవీ తాజాగా విడుదలైన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' దెబ్బకి రెండో స్థానానికి దిగజారింది. తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం చెన్నైఎక్స్ ప్రెస్ రూ. 203 కోట్ల వసూలు చేసి నెం.1 స్థానానికి చేరుకుంది. కేవలం 21 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. నాలుగేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. ఈ వివరాలను స్వయంగా ఆ చిత్ర యూనిట్ సభ్యులే వెల్లడించారు.

    గతంలో అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన '3 ఇడియట్స్' రూ. 202 కోట్లతో నెం.1 స్థానంలో ఉండేది. చాలా కాలంగా ఆ రికార్డును ఎవరూ చేరుకోలేక పోయారు. ఇన్నేళ్లకు మళ్లీ షారుక్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రం ఆ రికార్డును అధిగమించింది.

    షారుక్ ఖాన్, దీపిక పదుకొనె జంటగా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా మొత్తం సౌతిండియా నేపథ్యంతో సౌతిండియా బాక్సాఫీసు వద్ద కూడా సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి.

    చెన్నై ఎక్స్ ప్రెస్

    చెన్నై ఎక్స్ ప్రెస్


    షారుక్-దీపిక జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం రూ. 203 కోట్లు వసూళ్లు సాధించి భారతీయ సినీ పరిశ్రమలో అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల కెక్కింది. మరి ఈ సినిమాను భవిష్యత్‌లో ఎవరు అధిగమిస్తారో చూడాలి.

    ‘3 ఇడియట్స్'

    ‘3 ఇడియట్స్'


    అమీర్ ఖాన్, మాధవన్, శర్మాన్ జోషి, కరీనా కపూర్ ముఖ్య పాత్రల్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ‘3 ఇడియట్స్' చిత్రం 2009లో విడుదలై రూ. 202 కోట్ల వసూళ్లు సాధించింది. అప్పటి నుంచి ఈ చిత్రం నెం.1 స్థానంలో కొనసాగుతోంది. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా రాకతో 3 ఇడియట్స్ 2వ స్థానంలోకి దిగజారింది.

    ఏక్ థా టైగర్

    ఏక్ థా టైగర్


    సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ జంటగా కబీర్ ఖాన్ దర్వకత్వంలో రూపొందిన ‘ఏక్ థా టైగర్' చిత్రం 2012లో విడుదలై రూ. 185 కోట్లు వసూలు చేసింది. ఈచిత్రం ప్రస్తుతం 3వ స్థానంలో కొనసాగుతోంది.

    యే జవానీ హై దివానీ

    యే జవానీ హై దివానీ


    రణబీర్ కపూర్-దీపిక పదుకొనె జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యే జవానీ హై దివానీ'. 2013 మే 31న విడుదలైన ఈ చిత్రం రూ. 179 కోట్లు వసూలు చేసి 4వ స్థానంలో నిలిచింది.

    దబాంగ్-2

    దబాంగ్-2


    సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘దబాంగ్' చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం ‘దబాంగ్-2'. అర్భాజ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈచిత్రం రూ. 150 కోట్ల వసూళ్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది.

    English summary
    
 Shah Rukh Khan's Chennai Express has broken the four-year-old record held by Aamir Khan's 3 Idiots. The film has crossed the coveted 202.57-crore mark, which was the highest Indian theatrical revenue for a Bollywood film after deduction of tax.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X