Chennai Love Story Day 4 Box Office: షాకింగ్‌గా చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్లు.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?

యువ హీరో కిరణ్ అబ్బవరం, యువ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేశ్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లను నమోదు చేస్తున్నది. సహ నిర్మాతగా ధీరజ్ మొగిలినేని వ్యవహరించగా, రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా 50 కోట్ల రూపాయల మైలురాయిని చేరేందుకు పరుగులు పెడుతున్నది. ఈ సినిమా గత 4 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 15 కోట్ల రూపాయలతో నిర్మించారు. తెలుగు రాష్ట్రాల, ఇతర ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర వాల్యూ కట్టడం జరిగింది. ఓవర్సీస్ రైట్స్‌ను 5 కోట్లుగా వాల్యూ కట్టారు. ఈ సినిమా 15 కోట్ల రూపాయల షేర్, 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేట్రికల్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Chennai Love Story Day 4 Expected Box Office

చెన్నై లవ్ స్టోరీ చిత్రం జూలై 23వ తేదీన ప్రదర్శించిన ప్రీమియర్లతో పాజిటివ్ మోడ్‌లో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా 3 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక తొలి రోజు విషయానికి వస్తే.. 5 కోట్ల రూపాయల నెట్, 5.75 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 5.75 కోట్ల నెట్, 6.75 కోట్ల గ్రాస్, మూడో రోజు 6.5 కోట్ల నెట్, 7.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మూడు రోజుల్లోనే ఈ సినిమా ఇండియాలో 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

ఇక రాష్ట్రాల వారీగా కలెక్షన్లు చూస్తే.. ఆంధ్రా, నైజాంలో ఈ సినిమా 17.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5 లక్షల రూపాయలు, కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, ఇతర ప్రాంతాల్లో 30 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. నార్త్ అమెరికా, యూకే, ఐర్లాండ్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయని ఓవర్సీస్ డిస్టిబ్యూటర్ ప్రత్యాంగీరా సినిమాస్ వెల్లడించింది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 400k డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 4 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసిందని అధికారికంగా వెల్లడించారు. ఇక యూకే, ఐర్లాండ్‌లో ఈ సినిమా 35K పౌండ్స్ అంటే భారతీయ కరెన్సీలో 45 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ప్రత్యాంగీరా తెలిపింది. ఇతర దేశాల్లో వసూలైన కలెక్షన్లు కలిపితే సుమారుగా 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ సినిమా 4వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం సోమవారం కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలిచింది. ఈ చిత్రం కడపటి వార్తలు అందేసరికి తెలుగు రాష్ట్రాల్లో 1 కోటిన్నరకు పైగా వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఆంధ్రాలో 75 లక్షలు, తెలంగాణలో 75 లక్షలు వసూలు చేసింది. కర్ణాటకలో 20 లక్షల రూపాయల వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నైట్ షోలు పూర్తయ్యే సరికి ఈ చిత్రం 3 నుంచి 4 కోట్ల మేర వసూళ్లను సాధించే అవకాశం ఉందని అంచనా వేశారు.

అయితే ఈ సినిమా ఓవరాల్‌గా 3 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం 28 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కానీ ఈ చిత్రం మూడు రోజుల్లో 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక 4వ రోజుతో ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం.. 31 కోట్ల గ్రాస్, ప్రొడ్యూసర్ ప్రకారం.. 43 నుంచి 45 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ సినిమా త్వరలోనే 50 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: మణిశర్మ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రవి నంబూరి, కథ: సాయి రాజేశ్, సినిమాటోగ్రఫి: విశ్వాస్ డేనియల్, ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్ ముదావత్, లిరిక్స్: అనంత శ్రీరాం తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం జూలై 24వ తేదీన రిలీజైన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X