Chennai Love Story Business: చెన్నై లవ్ స్టోరి ప్రీ రిలీజ్ బిజినెస్.. కిరణ్ అబ్బవరం మూవీ లాభాల్లోకి రావాలంటే?
టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ చిత్రాలతో కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొంటున్న యువ హీరో కిరణ్ అబ్బవరం, యువ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేశ్, ఎస్కేఎన్ నిర్మించారు. సహ నిర్మాతగా ధీరజ్ మొగిలినేని వ్యవహరించారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: మణిశర్మ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రవి నంబూరి, కథ: సాయి రాజేశ్, సినిమాటోగ్రఫి: విశ్వాస్ డేనియల్, ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్ ముదావత్, లిరిక్స్: అనంత శ్రీరాం తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం జూలై 24వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ఎమోషనల్ ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రాన్ని క్వాలిటీతో నిర్మించారు. సీనియర్ ఆర్టిస్టులు, టాప్ టెక్నిషియన్స్‌ను ఈ సినిమా కోసం పనిచేయించారు. రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి ఈ సినిమాను సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమా ప్రమోషన్స్, అలాగే ప్రొమోలు, పాటలకు భారీ ఆదరణ దక్కడంతో బిజినెస్ వర్గాల్లో హైప్ క్రియేట్ అయింది. దాంతో బిజినెస్ కూడా భారీగా జరిగిందనే విషయం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఓటీటీ రైట్స్‌కు మంచి ఆఫర్ లభించింది. ఈ సినిమా హక్కుల బిజినెస్ 15 కోట్ల రూపాయల మేర జరిగింది. ఆడియో రైట్స్‌కు 5 కోట్ల రూపాయల మేర ఆఫర్ లభించింది. నాన్ థియేట్రికల్ రైట్స్‌తో సుమారుగా 20 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్ రైట్స్‌కు మంచి ధర పలికింది. కిరణ్ అబ్బవరం నటించిన KA, K Ramp సినిమాలు భారీ విజయాలు అందుకోవడంతో ఈ సినిమా బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 15 కోట్ల మేర జరిగింది. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 35 కోట్ల మేర జరిగింది. రిలీజ్‌కు ముందే నిర్మాతలకు భారీ ప్రాఫిట్ లభించింది అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.
ఇక చెన్నై లవ్ స్టోరి సినిమా థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోను, ఓవర్సీస్‌లో మంచి ఓపెనింగ్స్ సాధించాల్సి ఉంటుంది. ఈ చిత్రం 15 కోట్ల షేర్, 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా రానున్న రోజుల్లో ఏ మేరకు లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు పంచిపెడుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications