»   »  కాల్ మనీ కీచకుల "చెర" నుంచి తప్పించుకుని...

కాల్ మనీ కీచకుల "చెర" నుంచి తప్పించుకుని...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నూటికి పది పదిహేను శాతం వడ్డీ గుంజడమే కాకుండా.. ఆడవాళ్ళ మానాలు సైతం దోచుకొనే కొందరు దుష్టులకు.. ఆత్మాభిమానంతోపాటు ధైర్య సాహసాలు దండిగా కలిగిన ఓ ధీర వనిత ఏ విధంగా బుద్ది చెప్పింది? సదరు నీచుల పీచమెలా ఆణిచింది? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం "చెర".

సభ్య సమాజం సిగ్గుతో తల దించుకొనేలా.. ఆమధ్య విజయవాడలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని "ఆర్.ఏ.ఆర్ట్స్" పతాకంపై జానీ నిర్మిస్తున్నారు.

నిజ జీవితంలో కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్ అయిన "కనక" హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి ప్రియ శిష్యుడు మహానందరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

పూర్ణిమ

పూర్ణిమ

శంకర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిన్నటి ప్రముఖ హీరోయిన్ పూర్ణిమ ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ప్రస్తుతం విశాఖపట్నంలో పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

జానీ మాట్లాడుతూ

జానీ మాట్లాడుతూ

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సైతం సమకూర్చిన చిత్ర నిర్మాత జానీ మాట్లాడుతూ.. "ప్రఖ్యాత దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డిగారి దగ్గర 34 సినిమాలకు పని చేసిన మహానందరెడ్డి "చెర" చిత్రాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. రియల్ లైఫ్ లో కరాటే బ్లేక్ బెల్ట్ హోల్డర్ అయిన కనక చేసే పోరాటాలు, ఆమె పెర్ఫార్మెన్స్ "చెర" చిత్రానికి ముఖ్య ఆకర్షణ అన్నారు.

అందరికీ నచ్చుతుంది

అందరికీ నచ్చుతుంది

నిన్నటి ప్రముఖ హీరోయిన్ పూర్ణిమ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నఈ చిత్రానికి ప్రముఖ రచయిత టి.సాయినాధ్ సంభాషణలు సమకూర్చుతున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కూడా పార్లెల్ గా జరుపుకుంటోంది. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న "చెర" చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది" అన్నారు.

నటీనటులు, తెరవెనక

నటీనటులు, తెరవెనక

నాగబాబు, తాగుబోతు రమేష్, సాయి, గుండు అశోక్ కుమార్, ముఖేష్, అరుణ, వేణు, గబ్బర్ సింగ్ మరియు జబర్దస్త్ బ్యాచ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: లోకేష్, మ్యూజిక్: డేవిడ్, మాటలు: టి.సాయినాధ్, కో-డైరెక్టర్: పవన్, సమర్పణ: భవాని శ్రీనివాస్, స్క్రీన్-ప్లే-నిర్మాత: జానీ, దర్శకత్వం: మహదానందరెడ్డి !!

English summary
Check out details of "Chera" movie. A Film Based on Call Money scam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu