రామ్ చరణ్, వినాయక్ చిత్రం బిజినెస్ రికార్డ్
కాజల్ అగర్వాల్, అమలా పౌల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్వి పాత్రాభినయం చే్స్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా సాగనుంది. అలాగే చిరంజీవి సూపర్ హిట్ శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో పాట ను ఈ చిత్రం కోసం రీమిక్స్ చేస్తున్నారు. రామ్ చరణ్,కాజల్ పై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.
ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. దర్శకుడు వినాయక్ చిత్రం గురించి చెబుతూ ..చిరంజీవిగారితో 'ఠాగూర్' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తామని అన్నారు. నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...చరణ్‌ని ఒక కొత్త తరహా పాత్రలో చూపెట్టబోతున్నారు దర్శకుడు.
వినోదం, యాక్షన్... తదితర అంశాలు అభిమానుల్ని మెప్పించేలా ఉంటాయి. వాణిజ్య విలువలతో కూడిన కథాంశమిది. వినోదాత్మకంగా సాగుతుంది. మగధీర' తర్వాత కాజల్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రమిదే. సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, కథ, మాటలు: ఆకుల శివ,ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.


Click it and Unblock the Notifications












