Chhaava 14 days Collections: చరిత్ర సృష్టించిన చావా.. ఇండియాలో వీకి కౌశల్ మూవీ అరుదైన రికార్డు
బాలీవుడ్ స్టార్ హీరో వికీ కౌశల్, నేషనల్ క్రష్ జంటగా నటించిన వార్ యాక్షన్ చిత్రం ఛావా బాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్నది. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ నిర్మాణ సారథ్యంలో మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందించిన ఛావా చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం రెండో వారాంతంలో అరుదైన రికార్డును సొంతం చేసుకొంటూ సంచలనం రేపుతున్నది. ఈ సినిమా బాలీవుడ్‌లో అరుదైన చరిత్రను సృష్టించింది. ఆ రికార్డు వివరాల్లోకి వెళితే..
ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా, డయానా పెంటీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. దేశభక్తిని రగలించే ఈ సినిమాలో సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫి, మనీష్ ప్రధాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మొత్తంగా ఈ చిత్రాన్ని సుమారుగా 125 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఛావా సినిమా రిలీజ్ తర్వాత తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించడం మొదలుపెట్టింది. తొలి వారాంతంలోనే ఇండియాలో 116.5 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత అదే దూకుడును ప్రదర్శిస్తూ తొలివారం ముగిసే సమయానికి 220 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండో వారంలో కూడా అంతే బలంగా కలెక్షన్లను నమోదు చేస్తున్నది. రెండో వారంలో 13వ రోజు వరకు 170 కోట్ల రూపాయలు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా 390 కోట్ల మేర కలెక్షన్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఇప్పటి వరకు నమోదు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా హిందీ సిని రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన 9వ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. గతంలో అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీని సాధించిన 375 కోట్ల రూపాయలు, రణ్‌బీర్ నటించిన సంజూ 343 కోట్ల వసూళ్ల రికార్డును అధిగమించింది.

తాజాగా కేజీఫ్ 2, యానిమల్ సినిమా కలెక్షన్ల రికార్డులపై ఛావా గురిపెట్టింది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా సాధించిన 435 కోట్ల రూపాయల ఫీట్‌ను, రణబీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రం సాధించిన 503 కోట్ల రూపాయల రికార్డుపై వికీ కౌశల్ కన్నేసింది. ఈ సినిమా రికార్డులను ఛావా అధిగమిస్తుందా? లేదా అనే వేచి చూడాల్సింది.
ఇదిలా ఉండగా, ఛావా చిత్రం 14వ రోజున కూడా బాక్సాఫీస్ వద్ద బలంగా కనిపిస్తున్నది. ఈ సినిమా సుమారుగా 10 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా ఓవర్సీస్‌లో 78 కోట్ల రూపాయలు, ఇండియాలో 432 కోట్ల రూపాయల గ్రాస్, 390 కోట్ల నెట్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 540 కోట్లకుపైగానే కలెక్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











