Chhaava Day 1 Box Office: ఛావా మూవీకి తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే? రష్మిక మందన్న మ్యాజిక్ పనిచేస్తుందా

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మోస్ట్ టాలెంటెడ్ హీరో వికీ కౌశల్ జంటగా రూపొందిన చిత్రం ఛావా. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నది. అయితే ఈ సినిమా బడ్జెట్, అడ్వాన్స్ బుకింగ్, అలాగే తొలి రోజు కలెక్షన్ల అంచనాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మరాఠా కింగ్ చత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా కీలక పాత్రల్లో నటించారు. డయానా పెంటీ స్పెషల్ రోల్ కనిపించనున్నాను. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫి, మనీష్ ప్రధాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Chhaava Box Office Day 1 predicted Collections Worldwide Rashmika Mandanna movie get huge response at GBOC

ఛావా సినిమాను పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాలో స్టార్ యాక్టర్లు, టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేయడంతో వారి పారితోషికాలు భారీగా ఉన్నాయి. దాంతో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా గ్రాండ్‌గా దేశవ్యాప్తంగా చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 130 కోట్ల రూపాయలతో రూపొందించారు.

ఛావా ప్రమోషన్స్‌ ద్వారా భారీగా బజ్ క్రియేట్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అత్యధిక స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఢిల్లీ, నోయిడా, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో తొలి రోజు 1100 షోలు స్క్రీనింగ్ చేస్తుండటం విశేషంగా మారింది. అలాగే బెంగళూరులో కూడా భారీగా ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3 వేల షోలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేశఆరు.

Chhaava Box Office Day 1 predicted Collections Worldwide Rashmika Mandanna movie get huge response at GBOC

ఇదిలా ఉండగా, రష్మిక మందన్న నటించిన ఈ సినిమాకు ఇటీవల అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. ఈ సినిమాకు ప్రధాన నగరాల్లో మంచి రెస్పాన్స్ వస్తున్నది. దాంతో ఈ సినిమా తొలి రోజు భారీ వసూళ్లను రాబడుతుందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ సినిమాకు నేషనల్ మల్టీ‌ప్లెక్స్ చైనా థియేటర్లలో సుమారుగా 150000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ సినిమా 11 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఛావా అడ్వాన్స్ బుకింగ్‌కు వస్తున్న ఊపును చూస్తే ఫస్ట్ డే కలెక్షన్లు భారీగానే ఉండే అవకాశం ఉంది. ఈ సినిమా సుమారుగా 15 నుంచి 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ రేంజ్ పెరిగి 25 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా తొలి రోజు ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: chhaava rashmika mandanna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X