Chhaava Day 4 Collections: ఛావా కలెక్షన్ల సంచలనం .. రష్మిక మూవీకి ఎన్ని కోట్ల వసూళ్లంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మోస్ట్ టాలెంటెడ్ హీరో వికీ కౌశల్ జంటగా రూపొందిన చిత్రం ఛావా. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. మరాఠా కింగ్ చత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా కీలక పాత్రల్లో నటించారు. డయానా పెంటీ స్పెషల్ రోల్ కనిపించనున్నాను. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫి, మనీష్ ప్రధాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా 4 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఛత్రపతి శివాజీ వారసుడు సంభాజీ మహారాజ్ జీవిత కథగా ఛావా సినిమాను పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాలో స్టార్ యాక్టర్లు, టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేయడంతో పారితోషికాలు భారీగా నమోదు అయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా భారీగా చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 130 కోట్ల రూపాయలుగా ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు.

Chhaava Box Office Day 4 expected Collections Worldwide Rashmika Mandanna Movie at 150 Crores

యానిమల్, పుష్ప 2 తర్వాత రష్మిక క్రేజ్ భారీగా ఉండటం, ఛావా ప్రమోషన్స్‌ ద్వారా భారీగా బజ్ క్రియేట్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అత్యధిక స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేశారు. ఢిల్లీ, నోయిడా, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో తొలి రోజు 1100 షోలు, బెంగళూరులో కూడా భారీగా ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3 వేల షోలు ప్రదర్శించారు. దాదాపు ఇండియాలోనే ఈ సినిమాను సుమారుగా 5 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. దాంతో తొలి వారాంతం భారీగా కలెక్షన్లు నమోదు అవుతున్నాయి.

ఛావా చిత్రానికి తొలి రోజు అనూహ్యాంగా పాజిటివ్ టాక్ నమోదైంది. దాంతో మార్నింగ్, మ్యాట్నిలకు పెద్దగా ఓపెనింగ్స్ రాకపోయినప్పటికీ.. ఫస్ట్, సెకండ్ షోలకు భారీగా ఆక్యుపెన్సీ పెరిగింది. దాంతో ఫస్ట్ డే ఈ సినిమాకు 33 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక రెండో రోజు 40 కోట్ల రూపాయలు రాబట్టింది. అలాగే 3వ రోజు ఆదివారం 48 కోట్ల రూపాయలు వసూలు చేయడం విశేషంగా మారింది.

వికీ కౌశల్ పవర్ ప్యాక్ట్ ఫెర్ఫార్మెన్స్‌తో రూపొందిన ఈ సినిమా 121 కోట్ల రూపాయలను గత మూడు రోజుల్లో ఇండియాలోనే బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. ఈ సినిమా మౌత్ టాక్ స్ట్రెడ్ కావడంతో రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. దాంతో ఈ సినిమా రానున్న రోజుల్లో భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Chhaava Box Office Day 4 expected Collections Worldwide Rashmika Mandanna Movie at 150 Crores

ఇక ఛావా సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా రికార్డు వసూళ్లు నమోదు చేస్తున్నది. ఈ చిత్రం మూడు రోజుల్లో 3 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో ఈ చిత్రం 26 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 147 కోట్ల రూపాయల కలెక్షన్లనను నమోదు చేసింది. ఈ చిత్రం త్వరలోనే 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ఛావా సినిమాకు 4వ రోజు అంటే సోమవారం కూడా అత్యధికంగా వసూళ్లు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ సినిమాకు సుమారుగా 35 నుంచి 40 శాతం ఆక్యుపెన్సీ ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమా 4వ రోజు 10 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

More from Filmibeat

Read more about: chhaava rashmika mandanna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X