Chhaava Day 5 Collections: 200 కోట్లకు చేరువగా ఛావా.. వికీ కౌశల్, రష్మిక మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

ఛత్రపతి శివాజీ వారసుడు సంభాజీ మహారాజ్ జీవిత కథగా పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కించిన చిత్రం ఛావా. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మోస్ట్ టాలెంటెడ్ హీరో వికీ కౌశల్ జంటగా నటించారు. చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా తొలి రోజు నుంచే రికార్డు స్థాయి కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం 200 కోట్ల రూపాయల మైలురాయికి చేరువైంది. ఈ సినిమా 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మరాఠా కింగ్ చత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా కీలక పాత్రల్లో నటించారు. డయానా పెంటీ స్పెషల్ రోల్ కనిపించనున్నాను. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫి, మనీష్ ప్రధాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Chhaava Box Office Day 5 expected Collections Worldwide Rashmika Mandanna Movie inching towards 200 Crores

ఛావా సినిమాలో స్టార్ యాక్టర్లు, టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేయడంతో పారితోషికాలు భారీగా నమోదు అయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా భారీగా చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 130 కోట్ల రూపాయలుగా ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు. ఈ సినిమాను ఇండియాలో 4500 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 5500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

రష్మిక మందన్న నటించిన ఈ సినిమా తొలి రోజు గ్రాండ్‌గా 31 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆ తర్వాత ప్రతీ రోజు కలెక్షన్లను పెంచుకొంటూ పోయింది. రెండో రోజు 37 కోట్ల రూపాయలు, 3వ రోజు 49 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో మూడు రోజుల్లోనే 117 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమా వికీ కౌశల్ కెరీర్‌లో భారీ వసూళ్లను రాబట్టే దిశగా అడుగులేస్తున్నది.

Chhaava Box Office Day 5 expected Collections Worldwide Rashmika Mandanna Movie inching towards 200 Crores

ఇక బాక్సాఫీస్ కలెక్షన్లకు కఠిన పరీక్షగా నిలిచే సోమవారం నాడు ఛావా సినిమా పాస్ అయింది. ఊహించని విధంగా ఈ చిత్రం 24 కోట్ల రూపాయలు ఇండియా వైడ్‌గా రాబట్టింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 142 కోట్ల రూపాయల వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇక 5వ రోజు కూడా ఈ చిత్రం 10 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా ఇండియాలో 152 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

వికీ కౌశల్ పవర్ పుల్ పాత్రలో ఛత్రపతి సంభాజీ మహారాజ్‌గా తన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టడంతో విదేశాల్లోని భారతీయులు ఈ సినిమాను చూసేందుకు పోటేత్తారు. దాంతో భారీగా కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఈ చిత్రం ఓవర్సీస్‌లో సుమారుగా 4 మిలియన్ డాలర్లకు పైగా అంటే.. భారతీయ కరెన్సీలో 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 187 కోట్ల రూపాయలను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Read more about: chhaava rashmika mandanna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X