400 కోట్ల ఛావా కలెక్షన్ల ప్రభంజనం.. స్త్రీ 2 రికార్డు బ్రేక్.. 9వ రోజు ఎన్ని కోట్లంటే?

హిందీ సినిమా రంగంలో స్టార్ హీరో వికీ కౌశల్, యానిమల్, పుష్ప 2 మూవీతో టాప్ హీరోయిన్‌గా మారిన రష్మిక మందన్న జంటగా దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను పాపులర్ ప్రొడ్యూసర్, స్త్రీ 2 ఫేమ్ దినేష్ విజాన్ నిర్మించారు. బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ప్రేమికుల దినోత్సవం రోజున
ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా కీలక పాత్రల్లో నటించారు. డయానా పెంటీ స్పెషల్ రోల్ కనిపించనున్నాను. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. దేశభక్తిని రగలించే ఈ సినిమాలో సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫి, మనీష్ ప్రధాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Chhaava Day 10 Expected Box Office Collections Worldwide Rashmika Mandanna s Movie breaks Shraddha Kapoor s Stree 2 inching 400 crores mile stone

130 కోట్ల బడ్జెట్‌తో
ఛావా సినిమాలో స్టార్ యాక్టర్లు, టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేయడంతో పారితోషికాలు భారీగా నమోదు అయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా భారీగా చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 130 కోట్ల రూపాయలుగా ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు. తొలుత ఈ మూవీని ఇండియాలో 4500 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 5500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కానీ పబ్లిక్ డిమాండ్ పెరగడంతో సినిమాను ఎక్కువ థియేటర్లకు పెంచారు.

తొలివారం 220 కోట్ల రూపాయలు
ఛావా పాజిటివ్ టాక్‌తో తొలి రోజు 31 కోట్ల రూపాయల వసూళ్లతో బాక్సాఫీస్ జర్నీని గ్రాండ్‌గా ప్రారంభించింది. ఆ తర్వాత తొలి రోజ కంటే ఎక్కువగా ప్రతీ రోజు కలెక్షన్లను పెంచుకొంటూ వెళ్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రం తొలివారం ముగిసే సమయానికి ఇండియాలో 220 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

రెండోవారంలో
ఇక ఛావా సినిమా రెండోవారంలో కూడా తన వసూళ్ల ప్రభంజనాన్ని కొనసాగిస్తూనే ఉంది. 8వ రోజున ఈ చిత్రం 24 కోట్ల నేషనల్ బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. ఇక రెండో శనివారం అంటే తొమ్మిదో రోజున అంతకు మించి అనేలా 44 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 287 కోట్లకుపైగా రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది.

Chhaava Day 10 Expected Box Office Collections Worldwide Rashmika Mandanna s Movie breaks Shraddha Kapoor s Stree 2 inching 400 crores mile stone

ఓవర్సీస్‌లో 55 కోట్లు
ఇక ఓవర్సీస్‌లో ఎన్నారై ప్రేక్షకులు ఛావా సినిమాకు నీరాజనం పట్టారు. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, గల్ఫ్ దేశాల్లో భారీ వసూళ్లతో సునామీని క్రియేట్ చేసింది. ఈ చిత్రం గత 9 రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్‌లో 55 కోట్లకుపైగా వసూళ్లను కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం 9 రోజుల్లో 342 కోట్లకుపైగా వసూళ్లను కొల్లగొట్టింది.

400 కోట్ల క్లబ్‌లోకి ఛావా
ఇక రెండో ఆదివారం ఛావా సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత బలంగా కనిపించింది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి క్రేజ్ కనిపించింది. ఈ సినిమా సుమారుగా 55 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ చిత్రం 10 రోజున కనీసం 55 కోట్ల రూపాయలను వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. దాంతో ఈ చిత్రం 400 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: chhaava rashmika mandanna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X