500 కోట్ల ఛావా సంచలనం.. యానిమల్, గద్దర్ 2, స్త్రీ రికార్డు బ్రేక్.. 11వ రోజు ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరో వికీ కౌశల్, నేషనల్ క్రష్ జంటగా నటించిన వార్ యాక్షన్ చిత్రం ఛావా బాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్నది. ఈ చిత్రం రెండో వారాంతంలో అరుదైన రికార్డును సొంతం చేసుకొంటూ సంచలనం రేపుతున్నది. ఈ సినిమా ఇప్పటికే 400 కోట్ల రూపాయల వసూళ్ల మైలు రాయిని దాటేసిన ఈ చిత్రం సాధించిన రికార్డు వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ నిర్మాణ సారథ్యంలో మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందించిన ఛావా చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. ఫిబ్రవరి 14వ తేదీన రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 334 కోట్ల నికర వసూళ్లు, 444 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతేకాకుండా ఈ చిత్రం రెండోవారాంతంలోనే బాలీవుడ్‌లో 100 కోట్ల రూపాయలను నికరంగా వసూలు చేయడం నికరంగా మారింది.

బాలీవుడ్‌లో ఛావా చిత్రం రెండో వారాంతం అంటే.. 10వ రోజున ఈ చిత్రం 109 కోట్ లరూపాయలను వసూలు చేసింది. గతంలో దాదాపు 100 కోట్ల రూపాయల చేరువగా హిందీ పరిశ్రమలో వసూలు చేసిన ఘనత స్త్రీ 2, గదర్ 2, యానిమల్, పఠాన్, దంగల్, సంజూ చిత్రాల పేరిట ఉంది. అయితే ఆ చిత్రాలను అధిగమించి అత్యధికంగా ఛావా చిత్రం వసూళ్లను రాబట్టింది.
గతంలో స్త్రీ 2 చిత్రం 94 కోట్ల రూపాయలు, గదర్ 2 చిత్రం 90 కోట్ల రూపాయలు, జవాన్ చిత్రం 87 కోట్ల రూపాయలు, యానిమల్ చిత్రం 82 కోట్ల రూపాయలను బాలీవుడ్‌లో వసూలు చేసింది. అయితే ఈ రేసులో పుష్ప 2 నెలకొల్పిన రికార్డును మాత్రం అధిగమించలేకపోయింది. పుష్ప చిత్రం సెకండ్ వీకెండ్‌లో 128 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

రష్మిక మందన్న నటించిన ఛావా చిత్రం గత 10 రోజులుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. ఈ చిత్రం 10వ రోజున ప్రపంచవ్యాప్తంగా 41 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 444 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా భారీగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు 7 మిలియన్లు అంటే సుమారుగా 61 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
వికీ కౌశల్ నటించిన ఛావా చిత్రం 11వ రోజున కూడా భారీగా బాక్సాఫీస్‌ను కుమ్మేసే ప్లాన్ కనిపిస్తున్నది. ఇండియాలో ఈ చిత్రం సుమారుగా 12 నుంచి 15 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 18 నుంచి 20 కోట్ల రూపాయల మధ్య కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. దాంతో ఈ చిత్రం 500 కోట్ల రూపాయలకు చేరువయ్యే ఛాన్ప్ కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











