Chhaava Day 33 Collections: బాక్సాఫీస్ వద్ద ఛావా ఆపసోపాలు.. షాకిచ్చేలా వసూళ్లు, ఎన్ని కోట్లంటే?
పాన్ ఇండియా సినిమాల దెబ్బతో బాలీవుడ్‌కు సౌండ్ లేకుండా పోయింది. ఏ సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో తెలియక హిందీ మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో శ్రద్ధా కపూర్ స్త్రీ 2 సినిమా ఊపిరిపోయగా.. తాజాగా వచ్చిన ఛావా మరోసారి బాలీవుడ్ మేకర్స్‌కు సంతోషం కలిగించింది. ఇప్పటికే దాదాపు రూ.750 కోట్లకు పైగా వసూళ్లతో 1000 కోట్ల క్లబ్ వైపు వడివడిగా పరుగులు తీస్తున్న ఈ సినిమా 33వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే
నిజ జీవితగాథకు, బయోపిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్‌కి మరోసారి నిజ జీవిత పాత్రను పోషించే అధికారం ఉంది. అది కూడా ఓ చారిత్రక పురుషుడు, మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ పాత్ర. మరాఠా సామ్రాజ్యానికి, మొఘల్ సామ్రాజ్యానికి మధ్య జరిగిన యుద్ధాలు, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దండయాత్రలు వంటి ఛారిత్రక అంశాలే ఇతివృత్తంగా ఛావాను లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు.

ఛావాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ , శంభాజీ సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్నలు నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ఆస్కార్ ఆవార్డ్ గ్రహీత ఏఆర్ రెహ్మన్ సంగీత సారథ్యం వహించారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఛావాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవల్‌లో విడుదల చేశారు.
టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఛావాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తోంది ఛావా. తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు.. మూడో వారంలో రూ. 87 కోట్లు.. నాలుగో వారంలో రూ.60 కోట్లను రాబట్టింది. వర్కింగ్ డేస్‌లో కాస్త డల్‌గా సాగినప్పటికీ, వీకెండ్‌లో మాత్రం ఛావా దుమ్మురేపుతోంది. సినిమా విడుదలైన నాటి నుంచి ప్రతి వారాంతంలోనూ ఈ విషయం ప్రూవ్ చేశాడు విక్కీ కౌశల్.
రిలీజై నెల రోజులపైనే అయినప్పటికీ ఛావా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో ఇప్పటి వరకు 12 మిలియన్ డాలర్లకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ఆ సంస్థ ప్రకటించింది. తద్వారా ఒక హిందీ చిత్రానికి ఈ రేంజ్‌లో టికెట్లు బుక్ అవ్వడం ఇదే తొలిసారని తెలిపింది. ఇప్పటి వరకు ఈ ఘనత శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 పేరిట ఉండేది. తాజాగా ఛావా దానిని క్రాస్ చేసినట్లు బుక్ మై షో ప్రకటించింది. రానున్న రోజుల్లో బుకింగ్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక 33 రోజు వసూళ్ల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా పరీక్షల సీజన్ ప్రారంభం కావడంతో దాని ప్రభావం సినిమాలపై పడింది. ఛావా కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటోంది. మంగళవారం విక్కీ కౌశల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.2.75 కోట్ల వసూళ్లను సాధించింది. మరి 5వ వారం ముగిసేసరికి ఛావా ఎన్ని కోట్లను రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











