Chhaava Day 5 Collections: 250 కోట్లకు చేరువగా ఛావా వసూళ్లు.. రష్మిక మూవీకి 5వ రోజు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరో వికీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను పాపులర్ ప్రొడ్యూసర్, స్త్రీ 2 ఫేమ్ దినేష్ విజాన్ నిర్మించారు. బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా కీలక పాత్రల్లో నటించారు. డయానా పెంటీ స్పెషల్ రోల్ కనిపించనున్నాను. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫి, మనీష్ ప్రధాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Chhaava Day 5 Box Office Collections Worldwide Vicky Kaushal s Movie racing towards 250 Crores milestone

ఛావా సినిమాలో స్టార్ యాక్టర్లు, టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేయడంతో పారితోషికాలు భారీగా నమోదు అయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా భారీగా చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 130 కోట్ల రూపాయలుగా ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు. ఈ సినిమాను ఇండియాలో 4500 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 5500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

వికీ కౌశల్ నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచి రికార్డు వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం ఫస్ట్ డే 33 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు 37 కోట్లు, మూడో రోజు 49 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 24 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో గత 4 రోజుల్లో ఈ సినిమా 140 కోట్లకుపైగా నెట్, 170 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కేవలం ఇండియాలోనే రాబట్టింది.

Chhaava Day 5 Box Office Collections Worldwide Vicky Kaushal s Movie racing towards 250 Crores milestone

ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఛావా సినిమాకు ఎదురే లేకుండా పోయింది. విదేశాల్లో కెప్టెన్ అమెరికా 4 సినిమా ప్రభంజనాన్ని ఎదుర్కొంటూ భారీ వసూళ్లను నమోదు చేసింది. గత 5 రోజుల్లో ఈ చిత్రం 3.8 మిలియన్ డాలర్ల కలెక్షన్లు అంటే.. భారతీయ కరెన్సీలో 36 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో 4 రోజుల్లో ఈ సినిమా 206 కోట్ల రూపాయలను రాబట్టింది.

రష్మిక మందన్న నటించిన ఛావా చిత్రం 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఐదో రోజున కూడా రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇండియాలో 26 కోట్ల రూపాయలను, ప్రపంచవ్యాప్తంగా 32 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 238 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Read more about: chhaava rashmika mandanna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X