Chhaava Box Office: ఛావా కలెక్షన్ల సంచలనం.. 300 కోట్లకు క్లబ్‌లోకి రష్మిక మందన్న మూవీ!
హిందీ సినిమా రంగంలో స్టార్ హీరో వికీ కౌశల్, యానిమల్, పుష్ప 2 మూవీతో టాప్ హీరోయిన్‌గా మారిన రష్మిక మందన్న జంటగా దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను పాపులర్ ప్రొడ్యూసర్, స్త్రీ 2 ఫేమ్ దినేష్ విజాన్ నిర్మించారు. బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా కీలక పాత్రల్లో నటించారు. డయానా పెంటీ స్పెషల్ రోల్ కనిపించనున్నాను. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. దేశభక్తిని రగలించే ఈ సినిమాలో సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫి, మనీష్ ప్రధాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

ఛావా సినిమాలో స్టార్ యాక్టర్లు, టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేయడంతో పారితోషికాలు భారీగా నమోదు అయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా భారీగా చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 130 కోట్ల రూపాయలుగా ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు. తొలుత ఈ మూవీని ఇండియాలో 4500 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 5500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కానీ పబ్లిక్ డిమాండ్ పెరగడంతో సినిమాను ఎక్కువ థియేటర్లకు పెంచారు.
ఛావా చిత్రం తొలి రోజు 31 కోట్ల రూపాయలు, రెండో రోజు 37 కోట్ల రూపాయలు, మూడో రోజు 49 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 24 కోట్ల రూపాయలు, 5వ రోజు 26 కోట్ల రూపాయలు, 6వ రోజు 32 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో అంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలోనే ఈ చిత్రం 198 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
రష్మిక మందన్న నటించిన ఛావా చిత్రం కేవలం దేశీయంగానే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం గత 6 రోజుల్లో 5 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 43 కోట్లకుపైగా వసూళ్లను కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం 241 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద బలంగా నిలుస్తూ అంతర్జాతీయ మార్కెట్‌లో కెప్టెన్ అమెరికా 4 పోటీని తట్టుకొని కలెక్షన్లను సాధిస్తున్నది.
సంభాజీ మహారాజ్‌గా వికీ కౌశల్ నటించిన ఈ చిత్రం 7వ రోజున కూడా స్ట్రాంగ్‌గా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం ఇండియాలో 15 కోట్ల రూపాయలను, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 18 కోట్ల రూపాయలను వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం సుమారుగా 260 కోట్ల రూపాయలు రాబట్టి.. 300 కోట్ల రూపాయల వసూళ్ల మైలురాయిని చేరుకొనేందుకు పరుగులు పెడుతున్నది.


Click it and Unblock the Notifications











