‘సాహో’ వసూళ్లను అధిగమించిన శ్రద్ధా కపూర్ మరో చిత్రం, బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది!
శ్రద్ధా కపూర్ నటించిన రెండు సినిమాలు వారం గ్యాపులో విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి. ఆమె నటించిన 'సాహో' ఆగస్టు 30న విడుదలవ్వగా... మరో చిత్రం 'చిచ్చోరే' సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన వసూళ్లు బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్ అవుతున్నాయి.
'చిచ్చోరే' చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్-శ్రద్ధా కపూర్ జంటగా నటించగా దంగల్ ఫేం నితేష్ తివారీ దర్శకత్వం వహించారు. ఫస్ట్ వీకెండ్ వసూళ్లు అదిరిపోవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ అని తేలిపోయింది. వీక్ డే అయిన సోమవారం కూడా వసూళ్లు స్టడీగా ఉన్నాయి.

వసూళ్లు సూపర్బ్
‘చిచ్చోరే' సోమవారం(సెప్టెంబర్ 9)న రూ. 8.10 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇది విడుదల రోజైన శుక్రవారం(సెప్టెంబర్ 6) రూ. 7.32 కోట్ల వసూళ్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో వీకెండ్లో అద్భుతమైన గ్రోత్ సాధించింది. రెండో రోజైన శనివారం రూ. 12.25 కోట్లు, ఆదివారం రూ. 16.41 కోట్లు రాబట్టింది. దీంతో మొత్తం వసూళ్లు రూ. 44 కోట్లుకు చేరుకున్నాయి.

చిచ్చోరే రాకింగ్ అంటూ ట్వీట్
చిచ్చోరే బాక్సాఫీస్ వద్ద రాకింగ్ అంటూ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ‘4వ రోజైన సోమవారం మొదటి రోజుకంటే 10.66% ఎక్కువ వసూలు చేసింది. టికెట్ రేట్లు తక్కువగా ఉన్న సమయంలో కూడా అదరగొట్టింది. శుక్ర 7.32 కోట్లు, శని 12.25 కోట్లు, ఆది 16.41 కోట్లు, సోమ 8.10 కోట్లు. మొత్తం: రూ .44.08 కోట్లు ఇండియా బిజినెస్ అని వెల్లడించారు.

ఓవర్సీస్‌లో కూడా సూపర్
ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ వద్ద కూడా ‘చిచ్చోరే' మంచి ఫలితాలు సాధిస్తోంది. ఓపెనింగ్ వీకెండ్ $ 1.450 మిలియన్ (రూ. 10.39 కోట్లు) వసూలు చేసింది. యూఎస్ఏ + కెనడా: $ 615 K, యుఎఇ + జిసిసి: $ 520K. యుకె: $ 128 K, ఆస్ట్రేలియా: $ 60K, రెస్టాప్ వరల్డ్ 127 K " రాబట్టినట్లు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

సాహోను బీట్ చేసింది
సాహో మూవీ సోమవారం(సెప్టెంబర్ 9) హిందీ బాక్సాఫీస్ వద్ద రూ. 2.5 కోట్లు వసూలు చేసింది. దీంతో ‘చిచ్చోరే' చిత్రం కంటే వెనకబడినట్లయింది. సాహో హిందీ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీక్ రూ. 116 కోట్లు రాబట్టింది. సెకండ్ వీకెండ్‌కు మరో రూ. 14.95 కోట్లు యాడ్ కావడంతో టోటల్ వసూళ్లు రూ. 132 కోట్లకు రీచ్ అయ్యింది.


Click it and Unblock the Notifications











