twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాపీస్ చిచ్చర పిడుగు: వారం గ్యాపులో శ్రద్ధా కపూర్ ఖాతాలో వంద కోట్ల మూవీ!

    |

    'దంగల్' మూవీ ఫేం నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన 'చిచ్చోరే' బాక్సాఫీస్ వద్ద చిచ్చరపిడుగులా అదరగొడుతోంది. 10 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 100 కోట్ల లక్ష్యాన్ని అధిగమించింది. కాలేజీ ఫ్రెండ్షిప్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

    'చిచ్చోరే' ప్రస్థానం బాక్సాపీస్ వద్ద తొలి రోజు రూ. 7.32 కోట్ల ఓపెనింగ్స్‌తో ప్రారంభం అయింది. పాజిటివ్ రివ్యూలు, సూపర్ పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఫస్ట్ వీకెండ్ రూ. 35.98 కోట్లు వసూలు చేసింది. వీక్ డేస్‌లో కూడా అదరగొడుతూ తొలివారం పూర్తయ్యే సమయానికి వసూళ్లు రూ. 68 కోట్లకు రీచ్ అయ్యాయి.

    బరిలోకి బలమైన ప్రత్యర్థి వచ్చినప్పటికీ

    బరిలోకి బలమైన ప్రత్యర్థి వచ్చినప్పటికీ

    సెకండ్ వీకెండ్ బాక్సాఫీస్ బరిలోకి ‘డ్రీమ్ గర్ల్' రూపంలో బలమైన ప్రత్యర్థి వచ్చినప్పటికీ శుక్రవారం(సెప్టెంబర్ 13) రూ.5.34 కోట్లు రాబట్టడంలో సక్సెస్ అయింది. శనివారం వసూళ్లు మరింత పుంజుకుని రూ. 9.42 కోట్లు, ఆదివారం రూ. 10.47 కోట్లు వసూలు చేసింది.

    ఇండియాలో ఎంత బిజినెస్ చేసిందంటే

    ఇండియాలో ఎంత బిజినెస్ చేసిందంటే

    ఈ మూవీ ఇండియా బాక్సాఫీస్ వద్ద 10 రోజుల్లో రూ. 94.06 కోట్ల బిజినెస్ చేసినట్లు ప్రముఖ వ్యాపార విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు. ‘చిచ్చోరే తన వేగాన్ని ఏమాత్రం తటగ్గించలేదు. సెకండ్ వీకెండ్ కఠినమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటూ అద్భుతమైన వసూళ్లు సాధించింది. శుక్ర 5.34 కోట్లు, శని 9.42 కోట్లు, ఆది 10.47 కోట్లె. మొత్తం: 94.06 కోట్లు ఇండియా బిజినెస్' అని ట్వీట్ చేశారు.

    చిచ్చోరే

    చిచ్చోరే

    శ్రద్ధా కపూర్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, వరుణ్ శర్మ, ప్రతీక్ బబ్బర్, తాహిర్ రాజ్ భాసిన్, నవీన్ పాలిషెట్టి, సహర్ష్ కుమార్ శుక్లా, తుషార్ పాండే ముఖ్య పాత్రల్లో నటించారు, చిచ్చోరే 90ల్లో, ప్రస్తుత కాలంలో జరిగే కాలేజీ క్యాంపస్ డ్రామా. ఈ చిత్రం మీ కళాశాల రోజులను మీకు గుర్తు చేస్తుంది.

    శ్రద్ధా కపూర్ ఖాతాలో మరో రూ. 100 కోట్ల మూవీ

    శ్రద్ధా కపూర్ ఖాతాలో మరో రూ. 100 కోట్ల మూవీ

    ప్రపంచ వ్యాప్తంగా చిచ్చోరే చిత్రం రూ. 126 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఈ మూవీ విజయంతో శ్రద్దా కపూర్ ఖాతాలో వరుసగా రెండు రూ. 100 కోట్ల సినిమాలు పడ్డట్లయింది. చిచ్చోరే విడుదలకు వారం ముందే శ్రద్ధా కపూర్ నటించిన ‘సాహో' విడుదలై దాదాపు రూ. 450 కోట్లకుపైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే.

    English summary
    "Chhichhore refuses to slow down... Weekend 2 was extremely crucial since it faced a new, tough opponent [#DreamGirl], but the incredible biz clearly indicates it has cast a spell at the BO... [Week 2] Fri 5.34 cr, Sat 9.42 cr, Sun 10.47 cr. Total: ₹ 94.06 cr. #India biz." Taran Adarsh tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X