Acharya అమెరికా, యూకేలో భారీగా అడ్వాన్స్ బుకింగ్.. వారానికి ముందే కలెక్షన్లు ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు రోజు రోజుకు మూవీపై భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మహేష్ బాబు వాయిస్ ఓవర్, సినిమాకు సంబంధించిన భారీ సెట్లు సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమా అంచనాలకు తగినట్టుగానే క్రేజీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఎంత నమోదు అయిందంటే...

బలమైన కథ, సామాజిక సందేశంతో

బలమైన కథ, సామాజిక సందేశంతో

ఆచార్య మూవీ కథ విషయానికి వస్తే.. ఆలయ భూములు నేపథ్యంగా సాగే ధర్మస్థలి గ్రామంలో జరిగే సంఘటనల కథకు ప్రాణం. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు, ఇంటర్వెల్ సీన్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఇక సెకండాఫ్‌లో చివరి 30 నిమిషాలు సినిమా మరో రేంజ్‌లో ఉంటుంది. సామాజిక సందేశంతోపాటు ఎమోషన్స్, యాక్షన్ మిక్స్ చేసి కొరటాల అందించబోతున్నాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

రాంచరణ్ రోల్ హైలెట్‌గా

రాంచరణ్ రోల్ హైలెట్‌గా

ఆచార్య మూవీలో రాంచరణ్ పాత్ర హైలెట్‌గా ఉంటుందని విషయం గురించి ఇప్పటికే కొరటాల క్లారిటీ ఇచ్చాడు. అలాగే చిరంజీవి, రాంచరణ్ మధ్య సన్నివేశాలు హైలీ ఎమోషనల్‌గా ఉంటాయి. తెరపైన చూడటానికి అద్బుతంగా ఉంటుంది అని కొరటాల శివ స్పష్టం చేశారు.

అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్

అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్

అయితే ఆచార్య సినిమాపై అంచనాలు పెరగడంతో ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగా రెస్పాన్స్ వస్తున్నది. అమెరికాలో పలు థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. అమెరికాలో 124 లొకేషన్లలో 402 షోల కోసం టికెట్స్ బుక్ అయ్యాయి. దాంతో ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్లు 117,537 అమెరికన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 90 లక్షలకుపైగానే నమోదు అయ్యాయి.

బ్రిటన్‌లో ఆచార్య అడ్వాన్స్ బుకింగ్

బ్రిటన్‌లో ఆచార్య అడ్వాన్స్ బుకింగ్

ఇక బ్రిటన్‌లో కూడా ఆచార్య సినిమాకు భారీగా స్పందన కనిపించింది. వారం రోజులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు కాగా మంచి రెస్సాన్ కనిపించింది. శుక్రవారం వరకు ఈ సినిమా 105.33 బ్రిటన్ పౌండ్ల కలెక్షన్లు నమోదు అయ్యాయి. అంటే భారతీయ కరెన్సీలో 10 లక్షల రూపాయలకుపైగానే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్సు బుకింగ్ పలు ప్రాంతాల్లో ఓపెన్ కావాల్సి ఉంది.

ఓవర్సీస్‌లో ఆచార్య బిజినెస్ ఎంతంటే?

ఓవర్సీస్‌లో ఆచార్య బిజినెస్ ఎంతంటే?

అలాగే ఆచార్య మూవీకి సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమాకు సంబంంధించిన హక్కులను సుమారు 12 కోట్ల రూపాయలకు అమ్మడం జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 13 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X