MSVPG: ఫినిషింగ్‌లో శంకర వరప్రసాద్ గారు రేర్ ఫీట్.. చిరంజీవి దెబ్బకు వెంకటేష్ రికార్డ్ బ్రేక్!
హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మనశంకర వరప్రసాద్ గారులో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ అగ్రనటుడు విక్టరీ వెంకటేష్ కీలకపాత్ర పోషించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
మనశంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత?
కేథరిన్ థ్రెసా, శరత్ సక్సేనా, సచిన్ ఖేడేకర్, జరీనా వహబ్, అభినవ్ గోమటం, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్‌లు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా .. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహించగా, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సాంకేతిక నిపుణులు, నటీనటుల రెమ్యునరేషన్, ప్రోడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి మన శంకర వరప్రసాద్ గారు మూవీని దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

మనశంకర వరప్రసాద్ గారు బిజినెస్
ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... నైజాంలో 31 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 18 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 14 కోట్ల రూపాయలు, తూర్పుగోదావరిలో 9.5 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరిలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 4.25 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలు చొప్పున బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో 8.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయలు చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో మన శంకర వరప్రసాద్ గారు మూవీ లాభాల్లోకి రావాలంటే 125 కోట్ల రూపాయల షేర్.. 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు నిర్దేశించారు.
మనశంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్
మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ప్రీమియర్స్‌లో 30 కోట్ల రూపాయలు రాబట్టగా.. తొలి వారం 179.15 కోట్ల రూపాయలు, రెండో వారంలో 22.8 కోట్ల రూపాయలు, మూడో వారంలో 8.4 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 218 కోట్ల రూపాయలు.. 258 కోట్ల రూపాయల నికర వసూళ్లు రాబట్టింది. కర్ణాటకలో 22 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 219 కోట్ల రూపాయలు, తమిళనాడులో 3 కోట్ల రూపాయలు, కేరళలో 12 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 4.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇక ఓవర్సీస్‌లో మన శంకర వరప్రసాద్ గారు మూవీకి 43 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది. అయితే చిరంజీవి మూవీ 375 కోట్ల రూపాయలకు చేరువగా వసూళ్లను రాబట్టినట్లుగా చిత్ర నిర్మాతలు వెల్లడించారు.
మనశంకర వరప్రసాద్ గారు అరుదైన ఘనత
థియేట్రికల్ రన్ ముగిసేసరికి మన శంకర వరప్రసాద్ గారు మూవీ బుక్ మై షోలో దాదాపు 3.8 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ చేసినట్లు తెలిపింది. అనంతరం ఫిబ్రవరి 11 నుంచి మెగాస్టార్ మూవీ ఓటీటీలోకి వస్తుందని జీ5 ప్రకటించింది. ఓటీటీలో మన శంకర వరప్రసాద్ గారు మూవీ సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ.. జీ5లో ఇప్పటికీ నెంబర్‌వన్‌గా ట్రెండ్ అవుతోంది. తాజాగా మనశంకర వరప్రసాద్ గారు మూవీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మార్చి 2వ తేదీతో మనశంకర వరప్రసాద్ గారు మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా మొత్తం 109 సెంటర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 97 కేంద్రాల్లో, తెలంగాణలో 5 కేంద్రాల్లో, కర్ణాటకలో 6 కేంద్రాల్లో, ఒరిస్సాలో ఒక సెంటర్‌లో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది.
వెంకటేష్ రికార్డ్ బద్ధలు
ఇదే సమయంలో చిరంజీవి మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. గతేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం మూవీ 92 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ రికార్డ్‌ను మన శంకర వరప్రసాద్ గారు క్రాస్ చేసి ఆల్‌టైం రికార్డ్ నెలకొల్పింది. శత దినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు మాయమైపోయిన దశలో చిరంజీవి సినిమా 100 సెంటర్లకు పైగా అర్ధ శతదినోత్సవం జరుపుకోవడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











