Bhola Shankar Day 4 Collection: మరింత దిగజారిన భోళా శంకర్ కలెక్షన్స్.. హిట్ కష్టమే బాసూ!
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత సినిమాల్లో జోరు చూపిస్తున్నారు. వాటిలో హిట్లు ఎంత ఉంటున్నాయో ఫట్లు కూడా అలాగే ఉంటున్నాయి. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన చిరంజీవి లేటెస్టుగా చేసిన మరో రీమేక్ చిత్రం భోళా శంకర్ (Bhola Shankar).
తెలంగాణ యాస, కలకత్తా బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఫలితంగా కలెక్షన్స్ చాలా మందకోడిగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో భోళా శంకర్ 4వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

హీరోయిన్-చెల్లెలు: భోళా శంకర్ సినిమాలో చిరుకు జోడీగా మిల్కీ భామ తమన్నా ఆడిపాడగా.. చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. యంగ్ హీరో సుశాంత్ కీలకపాత్ర పోషించాడు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర సమర్పణలో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, రఘు బాబు, వెన్నెల కిశోర్, శ్రీముఖి, రష్మి గౌతమ్, తరుణ్ అరోరా, గెటప్ శ్రీను, తదితరులు నటించారు.

తక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్: చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుందని తెలిసినప్పటినుంచి భోళా శంకర్ సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. అయితే చిరు రీ ఎంట్రీ తర్వాత అతి తక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 12 కోట్లు, ఆంధ్రాలో మొత్తంగా రూ. 33.60 కోట్ల బిజినెస్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.60 కోట్లు, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు బిజినెస్ జరిగింది.

బడ్జెట్ ఎంతంటే?: భోళా శంకర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారు 1500 స్క్రీన్లలో ఆగస్ట్ 11న అంటే శుక్రవారం రోజున విడుదల చేసినట్లు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లో 900 థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాకు ఓవరాల్ గా రూ. 140 కోట్ల బడ్జెట్ అయిందని మేకర్స్ తెలిపారు. అయితే సినిమా విడుదలైన తొలి రోజు నుంచే ఊహించని విధంగా మిశ్రమ స్పందన వస్తోంది.

4వ రోజు కష్టంగా: బిల్లా, శక్తి, షాడో సినిమాల దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ సినిమాపై విపరీతమైన నెగెటివిటీ వస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతోంది. దీంతో ఈ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడుతోంది. ఫలితంగా భోళా శంకర్ సినిమాకు 4వ రోజున రూ. 2 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ మాత్రమే సాధించిందని అంచనా వేశారు. వీకెండ్ లోనే పెద్దగా రాబట్టని భోళా శంకర్ కు వర్కింగ్ డే మరింత కష్టంగా మారింది.
4 రోజుల్లో: భోళా శంకర్ సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. అయితే ఆయన సంగీతం కూడా భోళా శంకర్ కు పెద్దగా హైలెట్ కాలేకపోయిందని అంటున్నారు. దీంతో తొలి రోజు నుంచే వసూళ్లకు గండి పడింది. అలా విడుదలైన రోజున రూ. 16.25 కోట్లు, 2వ రోజు రూ. 5.05 కోట్లు, 3వ రోజు రూ. 5.1 కోట్లు, 4వ రోజు రూ. 2 కోట్లుగా నెట్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఇక 5 రోజుల్లో రూ. 28.40 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వస్తాయని అంచనా.

ఆక్యుపెన్సీ: భోళా శంకర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 14న యావరేజ్ గా 17.67 థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో 22.67%, బెంగళూరు 9.67%, చెన్నై 18%, విజయవాడ 11.67%, వరంగల్ 24.33% గుంటూరులో 27%, వైజాగ్ 18%, నిజామాబాద్ 7%, కరీంనగర్ 19.67%, కాకినాడ 33.33%, ఢిల్లీ 46%, ముంబై 10.33 శాతంగా ఆక్యుపెన్సీ నమోదు అయింది.


Click it and Unblock the Notifications











