Chiranjeevi Vs Balakrishna: బాలయ్య రికార్డును టచ్ చేయని చిరంజీవి.. ఎక్కడ 11.. ఎక్కడ 6 సామీ!

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తనదైన టాలెంట్లతో బడా హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి నుంచి దాదాపు నలభై ఏళ్లుగా టాలీవుడ్‌ను ఏలుతోన్న ఆయన.. ఎన్నో రికార్డులను సైతం తన పేరు మీద నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్లు క్రమంగా డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి ఓ విషయంలో నందమూరి బాలకృష్ణ 'అఖండ' రికార్డును టచ్ చేయలేకపోయారు. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

 గాడ్ ఫాదర్‌గా చిరంజీవి విశ్వరూపం

గాడ్ ఫాదర్‌గా చిరంజీవి విశ్వరూపం


మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన చిత్రమే 'గాడ్ ఫాదర్'. ఈ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్ మూవీని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించారు. థమన్ దీనికి సంగీతం ఇచ్చాడు. ఇది మలయాళ చిత్రం 'లూసీఫర్'కు రీమేక్‌గా వచ్చింది.

మొదటి వారంలో ఎంత వచ్చింది?

మొదటి వారంలో ఎంత వచ్చింది?

'గాడ్ ఫాదర్' మూవీ వారం రోజుల్లో ఆంధ్రా తెలంగాణలో రూ. 39.30 కోట్లు రాబట్టింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.75 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 53.10 కోట్లు షేర్‌, రూ. 96.35 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ఆరు రోజులకే పరిమితం అయింది

ఆరు రోజులకే పరిమితం అయింది

చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏడో రోజు మాత్రం కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా మంగళవారం ఈ సినిమాకు కేవలం రూ. 83 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది. దీంతో తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో కోటి కంటే తక్కువ మొత్తం వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం ఆరు రోజులు మాత్రమే కోటి, అంతకంటే ఎక్కువ రాబట్టినట్లు అయింది.

 2022లో ఆరో స్థానంలో గాడ్ ఫాదర్

2022లో ఆరో స్థానంలో గాడ్ ఫాదర్

2022 సంవత్సరంలో ఎక్కువ రోజులు కోటి రాబట్టిన చిత్రాల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా ఆరో స్థానంలో నిలిచింది. దీనికంటే ముందు RRR (17 రోజులు), కేజీఎఫ్ 2 (12 రోజులు), సర్కారు వారి పాట (11 రోజులు), కార్తికేయ 2 (11 రోజులు), F3 (7 రోజులు), భీమ్లా నాయక్ (6 రోజులు), బింబిసార (6 రోజులు) ఈ జాబితాలో నిలిచాయి.

ఓవరాల్‌గా టాప్‌లో ఉన్న సినిమా

ఓవరాల్‌గా టాప్‌లో ఉన్న సినిమా

టాలీవుడ్‌లో ఎక్కువ రోజులు కోటి రాబట్టిన చిత్రాల లిస్ట్‌లో బాహుబలి 2 టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ సినిమా ఏకంగా 28 రోజులు కోటి కంటే ఎక్కువ రాబట్టింది. దీని తర్వాత బాహుబలి (20 రోజులు), అల.. వైకుంఠపురములో (17 రోజులు), RRR (17 రోజులు), F2 (16 రోజులు), రంగస్థలం (14 రోజులు), మహర్షి (14 రోజులు), సైరా (13 రోజులు), సరిలేరు నీకెవ్వరు (13 రోజులు) ఉన్నాయి.

అఖండ రికార్డును టచ్ చేయలే

అఖండ రికార్డును టచ్ చేయలే

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు ఉన్నా.. బాలయ్య - చిరంజీవి మధ్య పోటీ అంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అందుకే ఆంధ్రా, తెలంగాణలో ఎక్కువ రోజులు కోటి రాబట్టిన చిత్రాల లిస్ట్‌లో వీళ్లిద్దరి మధ్య తేడాను ఫ్యాన్స్ హైలైట్ చేస్తున్నారు. బాలయ్య 'అఖండ' ఏకంగా 11 రోజుల పాటు కోటి రాబట్టగా.. చిరంజీవి 'గాడ్ ఫాదర్' మాత్రం ఆరు రోజులకే పరిమితమైపోయింది.

కలెక్షన్లలోనూ తేడా ఉందంటూ

కలెక్షన్లలోనూ తేడా ఉందంటూ

చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీ వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 53.10 కోట్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా కంటే తక్కువ థియేటర్లలో విడుదలైన 'అఖండ' మాత్రం వారం రోజుల్లో రూ. 53.49 కోట్లు వసూలు చేసింది. దీంతో మరో విభాగంలోనూ చిరంజీవి.. బాలయ్య రికార్డును దాటలేకపోయారని ఫ్యాన్స్ అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X