twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Godfather Official Collections: గాడ్ ఫాదర్‌కు మరో దెబ్బ.. ఒక్కరోజే చిరంజీవి రెండు రికార్డులు

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన శైలితో ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా అలరిస్తూ.. ఆరు పదుల వయసులోనూ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మరీ ముఖ్యంగా రీఎంట్రీలో ఎంతో వేగంగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటోన్న ఆయన.. ఇప్పటికే కొన్ని చిత్రాలతో వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవలే మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' అనే చిత్రంతో వచ్చారు. రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ మూవీకి కలెక్షన్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' మూవీ 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    గాడ్ ఫాదర్‌గా చిరంజీవి సందడి

    గాడ్ ఫాదర్‌గా చిరంజీవి సందడి

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రమే 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా తెరకెక్కించిన ఈ మూవీలో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. ఈ మూవీని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఎస్ థమన్ దీనికి సంగీతం ఇచ్చాడు. ఇది మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం 'లూసీఫర్'కు రీమేక్‌గా తెరకెక్కింది.

    మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ స్రవంతి: టాప్ కిందకు జరిపి మరీ!మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ స్రవంతి: టాప్ కిందకు జరిపి మరీ!

    గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

    గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

    పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 35 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 70.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6.50 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 91 కోట్ల బిజినెస్ అయింది.

    10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    10వ రోజు 'గాడ్ ఫాదర్'కు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 7 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రూ. 41 లక్షలు షేర్, రూ. 65 లక్షలు గ్రాస్‌ను మాత్రమే కలెక్ట్ చేసింది.

    తల్లైనా తగ్గని హీరోయిన్ ప్రణిత: ఎద భాగాలు కనిపించేలా హాట్ షోతల్లైనా తగ్గని హీరోయిన్ ప్రణిత: ఎద భాగాలు కనిపించేలా హాట్ షో

    10 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    10 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    'గాడ్ ఫాదర్'కు 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.88 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.56 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.58 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.20 కోట్లు, గుంటూరులో రూ. 3.82 కోట్లు, కృష్ణాలో రూ. 2.61 కోట్లు, నెల్లూరులో రూ. 1.95 కోట్లతో కలిపి రూ. 40.80 కోట్లు షేర్, రూ. 67.10 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    10 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 40.80 కోట్లు రాబట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 4.58 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 4.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.97 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 55.15 కోట్లు షేర్‌, రూ. 100.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    Dethadi Harika Marriage: షాకిస్తోన్న దేత్తడి హారిక పెళ్లి వార్త.. ఆ యూట్యూబర్‌తోనే లవ్ మ్యారేజ్!Dethadi Harika Marriage: షాకిస్తోన్న దేత్తడి హారిక పెళ్లి వార్త.. ఆ యూట్యూబర్‌తోనే లవ్ మ్యారేజ్!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 91 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 92 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 55.15 కోట్లు కలెక్ట్ అయ్యాయి. అంటే మరో రూ. 36.85 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

    ఒకేరోజు చిరంజీవి రికార్డులతో

    ఒకేరోజు చిరంజీవి రికార్డులతో

    టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రానికి ఆరంభంలో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, వీక్ డేస్ నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా రూ. 100 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. అలాగే, ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 40 కోట్ల షేర్ మార్కును చేరింది. దీంతో చిరంజీవి రికార్డులు కొట్టేశారు.

    English summary
    Megastar Chiranjeevi Did Godfather Movie Under Mohan Raja Direction. This Movie Collect 55.15 Cr in 10 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X