twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Godfather Official Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. 3 సెంచరీలతో చిరంజీవి నెంబర్ వన్ రికార్డు

    |

    మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఆయన సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ స్టార్‌గా దూసుకుపోతోన్నారు. ఇప్పటికీ అదే రేంజ్‌లో సత్తా చాటుతోన్న ఈ మెగా హీరో.. మరింత ఉత్సాహంగా సినిమాలు లైన్‌లో పెట్టుకుంటూ ముందుకెళ్తోన్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రేజీ కాంబోలో రూపొందిన ఈ మూవీకి శనివారం వసూళ్లు కాస్త పెరిగాయి. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' మూవీ 11 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

    గాడ్ ఫాదర్‌గా చిరంజీవి ఎంటర్

    గాడ్ ఫాదర్‌గా చిరంజీవి ఎంటర్

    మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సినిమానే 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా తెరకెక్కించిన ఈ మూవీలో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. ఈ మూవీని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇచ్చాడు. ఇది మలయాళ చిత్రం 'లూసీఫర్'కు రీమేక్‌గా వచ్చింది.

    తల్లైనా తగ్గని హీరోయిన్ ప్రణిత: ఎద భాగాలు కనిపించేలా హాట్ షోతల్లైనా తగ్గని హీరోయిన్ ప్రణిత: ఎద భాగాలు కనిపించేలా హాట్ షో

    గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

    గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

    రాజకీయ నేపథ్యంతో వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 35 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 70.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6.50 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 91 కోట్ల బిజినెస్ జరిగింది.

    11వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    11వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    'గాడ్ ఫాదర్' మూవీకి 11వ రోజు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి రూ. 56 లక్షలు షేర్, రూ. 90 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

    పైన ఏమీ లేకుండా సోనాల్ చౌహాన్ హాట్ షో: బాత్రూంలో అలా చూపిస్తూ!పైన ఏమీ లేకుండా సోనాల్ చౌహాన్ హాట్ షో: బాత్రూంలో అలా చూపిస్తూ!

    11 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    11 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    11 రోజుల్లో 'గాడ్ ఫాదర్'కు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.29 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.64 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.65 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.26 కోట్లు, గుంటూరులో రూ. 3.88 కోట్లు, కృష్ణాలో రూ. 2.68 కోట్లు, నెల్లూరులో రూ. 1.99 కోట్లతో కలిపి రూ. 41.36 కోట్లు షేర్, రూ. 68.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఆంధ్రా, తెలంగాణలో 11 రోజుల్లో రూ. 41.36 కోట్లు రాబట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 4.60 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 4.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.05 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 55.91 కోట్లు షేర్‌, రూ. 101.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    బ్రా తీసేసి అషు రెడ్డి అందాల ఆరబోత: పవన్ కోసం మరోసారి దారుణంగా!బ్రా తీసేసి అషు రెడ్డి అందాల ఆరబోత: పవన్ కోసం మరోసారి దారుణంగా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 91 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 92 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో దీనికి రూ. 55.91 కోట్లు కలెక్ట్ అయ్యాయి. అంటే మరో రూ. 36.09 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    మూడు వంద కోట్లతో మరో రికార్డు

    మూడు వంద కోట్లతో మరో రికార్డు

    టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రానికి ఆరంభంలో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, వీక్ డేస్ నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. అయినప్పటికీ తాజాగా ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్‌ను దాటేసింది. దీంతో మూడు వంద కోట్ల గ్రాస్‌లను అందుకున్న ఏకైక సీనియర్ హీరోగా చిరంజీవి రికార్డు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    English summary
    Megastar Chiranjeevi Did Godfather Movie Under Mohan Raja Direction. This Movie Collect 55.91 Cr in 11 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X