Godfather Official Collections: కలిసొచ్చిన సండే.. 12వ రోజు భారీగా.. హిట్‌కు అన్ని కోట్ల దూరంలో!

తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్ వీటికితోడు గ్రేస్‌తో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ.. టాలీవుడ్‌లో టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. మరీ ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన తీరిక లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూనే వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనే సినిమాను చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ మూవీకి ఆదివారం కలెక్షన్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' మూవీ 11 రోజుల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

గాడ్ ఫాదర్‌గా వచ్చేసిన మెగాస్టార్

గాడ్ ఫాదర్‌గా వచ్చేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కించిన పొలిటికల్ మూవీనే 'గాడ్ ఫాదర్'. మలయాళంలో వచ్చిన లూసీఫర్ మూవీకి రీమేక్‌గా రూపొందిన దీన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. ఈ మూవీని ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు.

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

స్టార్ల కలయికలో రూపొందిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 17.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 25 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 54 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 73 కోట్లు మేర బిజినెస్ అయింది.

12వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

12వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

12వ రోజు 'గాడ్ ఫాదర్' మూవీకి ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి రూ. 81 లక్షలు షేర్, రూ. 1.35 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

 12 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

12 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

'గాడ్ ఫాదర్'కు 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.11 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.40 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.76 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.75 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.35 కోట్లు, గుంటూరులో రూ. 3.96 కోట్లు, కృష్ణాలో రూ. 2.77 కోట్లు, నెల్లూరులో రూ. 2.07 కోట్లతో కలిపి రూ. 42.17 కోట్లు షేర్, రూ. 69.35 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఏపీ, తెలంగాణలో 12 రోజుల్లో రూ. 42.17 కోట్లు రాబట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 4.65 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 5.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 56.92 కోట్లు షేర్‌, రూ. 103.40 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో దీనికి రూ. 56.92 కోట్లు కలెక్ట్ అయ్యాయి. అంటే మరో రూ. 17.08 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

సండే భారీగా.. కొన్ని ప్రాంతాల్లోనే

సండే భారీగా.. కొన్ని ప్రాంతాల్లోనే

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రానికి ఆరంభంలో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, వీక్ డేస్ నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి కోటి రూపాయలు పైగానే వచ్చాయి. దీంతో ఇక కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సినిమా టార్గెట్‌ను చేరుకోవాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X