For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Godfather Collections:'గాడ్ ఫాదర్' కు సోమవారం ఎఫెక్ట్.. 13 రోజుల్లో ఇంతే.. రావాల్సింది ఎంతంటే?

    |

    రాజకీయం తర్వాత ఖైది నెంబర్ 150 మూవీతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటికీ ఇప్పటికీ తనదైన శైలీ నటన, గ్రేస్ తో తెలుగు సినిమాకు బాస్ గా ఉన్నారు చిరు. అయితే రీ ఎంట్రీ తర్వాత సినిమాలపై అంతకుముందుకంటే జోరుగా ఉన్నారు ఈ కొణిదెల శివశంకర వరప్రసాద్. ఇటీవల అక్టోబర్ 5న దసరా కానుకగా చాలా గ్రాండ్ గా విడుదలైంది గాడ్ ఫాదర్. సినిమా విడుదలతోనే.. చిరు అభిమానుల్లో పండుగ నెలకొంది. సినిమా సూపర్ హిట్ కావండతో చిరు ఫ్యాన్స్ లో పూనకం మొదలైంది. ఇదిలా ఉంటే కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతున్న గాడ్ ఫాదర్ మూవీ 13వ రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

    మోహన్ రాజా దర్శకత్వంలో..

    మోహన్ రాజా దర్శకత్వంలో..

    మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసీఫర్ మూవీ సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీకి తెలుగు రీమేక్ గా మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ వంటి తారాగణంతో మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ వచ్చింది. ఈ మూవీని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు.

    మూవీ బిజినెస్ వివరాలు ఇలా..

    మూవీ బిజినెస్ వివరాలు ఇలా..

    భారీ తారాగణంతో క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' సినిమాకు నైజాంలో రూ. 17.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 25 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 54 కోట్ల బిజినెస్ చేసుకుంది. దీంతోపాటు కర్నాకటలో రూ. 6 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 73 కోట్లు మేర బిజినెస్ అయింది.

    గాడ్ ఫాదర్ 13వ రోజు కలెక్షన్లు..

    గాడ్ ఫాదర్ 13వ రోజు కలెక్షన్లు..

    హీరో సత్యదేవ్ నెగెటివ్ రోల్ పోషించిన గాడ్ ఫాదర్ మూవీ 13వ రోజు ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి రూ. 33 లక్షలు షేర్, రూ. 50 లక్షల గ్రాస్‌ను వసూలు చేసింది.

    13 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చిందంటే?

    13 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చిందంటే?

    'గాడ్ ఫాదర్' గా చిరంజీవి నటించిన ఈ మూవీకి 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లు పర్వాలేదనిపిస్తోంది. ఏరియా వైస్ గా చూసుకుంటే నైజాంలో రూ. 12.17 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.45 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.81 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.79 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.39 కోట్లు, గుంటూరులో రూ. 3.99 కోట్లు, కృష్ణాలో రూ. 2.81 కోట్లు, నెల్లూరులో రూ. 2.09 కోట్లతో కలిపి రూ. 42.50 కోట్లు షేర్, రూ. 69.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

     ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంతంటే?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంతంటే?

    గాడ్ ఫాదర్ చిత్రానికి 13 రోజుల్లో ఆంధ్రా తెలంగాణలో రూ. 42.50 కోట్లు రాబట్టగా.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 4.66 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 5.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.12 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 57.33 కోట్లు షేర్‌, రూ. 104.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    ఇంకెంత రావాలంటే..?

    ఇంకెంత రావాలంటే..?

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ 'గాడ్ ఫాదర్' చిత్రానికి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లో దీనికి రూ. 57.33 కోట్లు కలెక్ట్ అయ్యాయి. అంటే మరో రూ. 16.67 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

     సోమవారం ఎఫెక్ట్..

    సోమవారం ఎఫెక్ట్..

    మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రానికి ప్రారంభంలో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, వీక్ డేస్ నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి ఆదివారం వసూళ్లు పెరగ్గా.. సోమవారం రోజు తగ్గాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 41 లక్షల షేర్, రూ. 70 లక్షల గ్రాస్ వచ్చాయి. కాగా ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన.. చిరంజీవి మూడో సినిమాగా రికార్డుకెక్కింది.

    English summary
    Megastar Chiranjeevi Godfather Movie Official 13 Days Worldwide Box Office Collection Is 104.10 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X