twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Godfather Official Collections: 15వ రోజు ఘోరంగా వసూళ్లు.. తొలిసారి ఇంత తక్కువగా.. ఇంకెంత రావాలంటే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆరు పదుల వయసులోనూ జెట్ స్పీడుతో సినిమాలు చేస్తోన్న ఆయన.. ఇప్పటికే ఈ ఏడాది 'ఆచార్య' మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ క్రమంలోనే ఇటీవలే మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' అనే సినిమాతో వచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీకి మంచి టాక్‌‌కు అనుగుణంగానే కలెక్షన్లు వచ్చాయి. కానీ, క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' మూవీ 15 రోజుల రిపోర్టు మీకోసం!

    గాడ్ ఫాదర్‌గా రచ్చ చేసిన చిరు

    గాడ్ ఫాదర్‌గా రచ్చ చేసిన చిరు

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కించిన పొలిటికల్ మూవీనే 'గాడ్ ఫాదర్'. మలయాళంలో వచ్చిన లూసీఫర్ మూవీకి రీమేక్‌గా రూపొందిన దీన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు.

    <strong>అందాల ఆరబోతలో గీత దాటిన దివి: సీక్రెట్ పార్ట్స్ కనిపించేలా హాట్ షో</strong><br />అందాల ఆరబోతలో గీత దాటిన దివి: సీక్రెట్ పార్ట్స్ కనిపించేలా హాట్ షో

    గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

    గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

    క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 17.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 25 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 54 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 73 కోట్లు మేర బిజినెస్ అయింది.

    15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    15వ రోజు 'గాడ్ ఫాదర్' మూవీకి ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 3 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 17 లక్షలు షేర్, రూ. 30 లక్షలు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.

    నగ్నంగా సీతా రామం హీరోయిన్: సినిమాలో అలా.. రియల్‌గా ఇంత దారుణంగా!నగ్నంగా సీతా రామం హీరోయిన్: సినిమాలో అలా.. రియల్‌గా ఇంత దారుణంగా!

    15 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    15 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    'గాడ్ ఫాదర్'కు 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మంచిగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.50కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.88 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.84 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.43 కోట్లు, గుంటూరులో రూ. 4.03 కోట్లు, కృష్ణాలో రూ. 2.86 కోట్లు, నెల్లూరులో రూ. 2.11 కోట్లతో కలిపి రూ. 42.89 కోట్లు షేర్, రూ. 70.55 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఏపీ, తెలంగాణలో 15 రోజుల్లో రూ. 42.89 కోట్లు రాబట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 4.71 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 5.13 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.16 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 15 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 57.89 కోట్లు షేర్‌, రూ. 105.15 కోట్లు గ్రాస్ వసూలైంది.

    Balakrishna Bollywood Entry: బాలీవుడ్‌లోకి బాలయ్య.. స్టార్ డైరెక్టర్ దిమ్మతిరిగే ప్లాన్Balakrishna Bollywood Entry: బాలీవుడ్‌లోకి బాలయ్య.. స్టార్ డైరెక్టర్ దిమ్మతిరిగే ప్లాన్

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లో దీనికి రూ. 57.89 కోట్లు కలెక్ట్ అయ్యాయి. అంటే మరో రూ. 16.11 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

    English summary
    Megastar Chiranjeevi Did Godfather Movie Under Mohan Raja Direction. This Movie Collect 57.89 Cr in 15 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X