Godfather Official Collections: గాడ్ ఫాదర్‌కు బిగ్ షాక్.. 16వ రోజు ఇంతే.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!
గతంలో కంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత యమ ఉత్సాహంగా వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఇప్పటికే కొన్ని మూవీలతో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సీనియర్ హీరో 'గాడ్ ఫాదర్' అనే చిత్రంతో వచ్చారు. పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. కానీ, అందుకు అనుగుణంగా కలెక్షన్లు రావడం లేదు. తాజాగా మరోసారి వసూళ్లు డౌన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' మూవీ 16 రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీరే చూడండి!

గాడ్ ఫాదర్‌గా చిరంజీవి సందడి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన సినిమానే 'గాడ్ ఫాదర్'. ఈ సినిమాలో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. మలయాళంలో వచ్చిన లూసీఫర్ మూవీకి రీమేక్‌గా రూపొందిన దీన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే
పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 17.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 25 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 54 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 73 కోట్లు బిజినెస్ జరిగింది.

16వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'గాడ్ ఫాదర్' మూవీకి 16వ రోజు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 2 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 12 లక్షలు షేర్, రూ. 20 లక్షలు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.

16 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
'గాడ్ ఫాదర్'కు తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో వసూళ్లు మంచిగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.52 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.90 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.85 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.44 కోట్లు, గుంటూరులో రూ. 4.04 కోట్లు, కృష్ణాలో రూ. 2.88 కోట్లు, నెల్లూరులో రూ. 2.12 కోట్లతో కలిపి రూ. 43.01 కోట్లు షేర్, రూ. 70.75 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా, తెలంగాణలో 16 రోజుల్లో రూ. 43.01 కోట్లు రాబట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 4.71 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 5.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.17 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 58.04 కోట్లు షేర్, రూ. 105.50 కోట్లు గ్రాస్ వసూలైంది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
క్రేజీ కాంబోలో రూపొందిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లో దీనికి రూ. 58.04 కోట్లు కలెక్ట్ అయ్యాయి. అంటే మరో రూ. 15.96 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











