Godfather Official Collections: చిరంజీవికి భారీ దెబ్బ.. హిట్ అవ్వాలంటే అన్ని కోట్లు రావాల్సిందే!

టాలీవుడ్‌లో దాదాపు నలభై ఏళ్లుగా హవాను చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో కంటే ఇప్పుడు మరింత వేగంగా సినిమాలు చేస్తోన్న ఆయన.. ఇప్పటికే కొన్ని చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ మెగా హీరో 'గాడ్ ఫాదర్' అనే చిత్రంతో వచ్చారు. ఫుల్ లెంగ్త్ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. కానీ, అందుకు అనుగుణంగా కలెక్షన్లు రావడం లేదు. తాజాగా ఇప్పుడు భారీ దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' మూవీ 17 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

గాడ్ ఫాదర్‌గా మారిన చిరంజీవి

గాడ్ ఫాదర్‌గా మారిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రమే 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. మలయాళంలో వచ్చిన లూసీఫర్ మూవీకి రీమేక్‌గా రూపొందిన దీన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని ఇచ్చాడు.

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 17.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 25 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 54 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 73 కోట్లు బిజినెస్ అయింది.

17వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

17వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

17వ రోజు 'గాడ్ ఫాదర్' మూవీకి ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 2 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 60 వేలు, నెల్లూరులో రూ. 40 వేలతో కలిపి రూ. 10 లక్షలు షేర్, రూ. 20 లక్షలు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.

17 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

17 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

'గాడ్ ఫాదర్'కు తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో వసూళ్లు మంచిగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.54 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.92 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.86 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.45 కోట్లు, గుంటూరులో రూ. 4.05 కోట్లు, కృష్ణాలో రూ. 2.89 కోట్లు, నెల్లూరులో రూ. 2.12 కోట్లతో కలిపి రూ. 43.11 కోట్లు షేర్, రూ. 70.95 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

17 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 43.01 కోట్లు రాబట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 4.72 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 5.16 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.18 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 17 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 58.17 కోట్లు షేర్‌, రూ. 105.75 కోట్లు గ్రాస్ వసూలైంది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 17 రోజుల్లో దీనికి రూ. 58.17 కోట్లు కలెక్ట్ అయ్యాయి. అంటే మరో రూ. 15.79 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X