Godfather Official Collections: గాడ్ ఫాదర్‌‌కు కోలుకోలేని షాక్.. హిట్ టాక్‌తో ఇలాంటి కలెక్షన్లా!

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను మైమరపించారు. ఈ క్రమంలోనే ఇటీవలే చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనే సినిమాను చేశారు. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ చిత్రానికి కలెక్షన్లు పడిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' మూవీ 18 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరు కూడా చూసేయండి!

గాడ్ ఫాదర్‌గా చిరు విశ్వరూపం

గాడ్ ఫాదర్‌గా చిరు విశ్వరూపం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తీసిన చిత్రమే 'గాడ్ ఫాదర్'. ఈ క్రేజీ మూవీలో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. మలయాళంలో వచ్చిన లూసీఫర్ మూవీకి రీమేక్‌గా రూపొందిన దీన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు.

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

పొలిటికల్ జోనర్‌లో రూపొందిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 18.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 25 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 54 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 73 కోట్లు బిజినెస్ జరిగింది.

18వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

18వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'ఆచార్య' వంటి పరాజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రమే 'గాడ్ ఫాదర్'. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ, రెండో వారం నుంచే క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 18వ రోజైన శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 6 లక్షలు మాత్రమే వచ్చాయి.

18 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

18 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

18 రోజుల్లో 'గాడ్ ఫాదర్'కు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మంచిగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.29 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.54 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.92 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.85 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.44 కోట్లు, గుంటూరులో రూ. 4.06 కోట్లు, కృష్ణాలో రూ. 2.90 కోట్లు, నెల్లూరులో రూ. 2.12 కోట్లతో కలిపి రూ. 43.12 కోట్లు షేర్, రూ. 70.95 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


ఆంధ్రా, తెలంగాణలో 18 రోజుల్లో రూ. 43.12 కోట్లు రాబట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 4.72 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 5.16 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.18 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 18 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 58.18 కోట్లు షేర్‌, రూ. 105.80 కోట్లు గ్రాస్ వసూలైంది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 18 రోజుల్లో దీనికి రూ. 58.18 కోట్లు కలెక్ట్ అయ్యాయి. అంటే మరో రూ. 15.82 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X