Godfather Official Collections: 2వ రోజు ఊహించని వసూళ్లు.. అప్పుడే అన్ని కోట్లు.. చిరంజీవి రికార్డు
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడుతో సినిమాలను చేసుకుంటూ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. ఇప్పుడు 'గాడ్ ఫాదర్' అనే చిత్రంతో వచ్చారు. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీ.. ఆరంభంలోనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీ రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

గాడ్ ఫాదర్‌గా చిరంజీవి సందడి
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రమే 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా తెరకెక్కించిన ఈ మూవీని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో విలక్షణ హీరో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించారు. థమన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 'లూసీఫర్'కు రీమేక్‌గా రూపొందింది.

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే
క్రేజీ కాంబోలో వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 35 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 70.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6.50 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 91 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

2వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'గాడ్ ఫాదర్'కు ఆంధ్రా, తెలంగాణలో రెండో రోజూ మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.38 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.96 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 45 లక్షలు, గుంటూరులో రూ. 60 లక్షలు, కృష్ణాలో రూ. 49 లక్షలు, నెల్లూరులో రూ. 33 లక్షలతో కలిపి రూ. 7.73 కోట్లు షేర్, రూ. 13.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకు కలిపి ఎంతొచ్చింది
రెండు రోజుల్లో 'గాడ్ ఫాదర్'కు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.27 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.11 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.04 కోట్లు, గుంటూరులో రూ. 2.35 కోట్లు, కృష్ణాలో రూ. 1.22 కోట్లు, నెల్లూరులో రూ. 90 లక్షలతో కలిపి రూ. 20.70 కోట్లు షేర్, రూ. 34.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
రెండు రాష్ట్రాల్లో 2 రోజుల్లో రూ. 20.70 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 2.30 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 1.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.55 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 27.35 కోట్లు షేర్, రూ. 50.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 91 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 92 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 27.35 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 64.65 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

రెండు రోజుల్లోనే రికార్డు నమోదు
మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు ఓపెనింగ్ డేన ఆంధ్రా, తెలంగాణలో అదిరిపోయే కలెక్షన్లు వస్తుంటాయి. అందుకు అనుగుణంగానే 'గాడ్ ఫాదర్' చిత్రం హైర్స్‌తో కలిపి మొదటి రోజు రూ. 38 కోట్ల గ్రాస్‌ను, రెండో రోజు రూ. 31 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా రెండు రోజుల్లోనే రూ. 69 కోట్లు రాబట్టింది. దీంతో అప్పుడే యాభై కోట్ల మార్కును దాటేసి చిరంజీవి రికార్డు కొట్టారు.


Click it and Unblock the Notifications











