Godfather Official Collections: 74 కోట్ల టార్గెట్.. 2 వారాల్లో అన్ని కోట్లు.. చిరుకు హిట్ రావాలంటే!

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అదే సత్తాను ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ హవా చూపిస్తున్నారు. అదే సమయంలో ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ మూవీకి మంచి టాక్‌తో పాటు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' మూవీ 2 వారాల రిపోర్టును చూద్దాం పదండి!

గాడ్ ఫాదర్‌గా మెగాస్టార్ సందడి

గాడ్ ఫాదర్‌గా మెగాస్టార్ సందడి

మెగాస్టార్ చిరంజీవి - మోహన్ రాజా కలయికలో రూపొందిన చిత్రమే 'గాడ్ ఫాదర్'. మలయాళంలో వచ్చిన లూసీఫర్ మూవీకి రీమేక్‌గా రూపొందిన దీన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. ఈ మూవీని ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

రాజకీయ నేపథ్యంతో రూపొందిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 17.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 25 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 54 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'గాడ్ ఫాదర్' మూవీకి 14వ రోజు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 22 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసింది.

2 వారాలకు కలిపి ఎంతొచ్చింది?

2 వారాలకు కలిపి ఎంతొచ్చింది?

2 వారాల్లో 'గాడ్ ఫాదర్'కు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మంచిగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.48 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.84 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.82 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.42 కోట్లు, గుంటూరులో రూ. 4.01 కోట్లు, కృష్ణాలో రూ. 2.84 కోట్లు, నెల్లూరులో రూ. 2.10 కోట్లతో కలిపి రూ. 42.72 కోట్లు షేర్, రూ. 70.25 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఏపీ, తెలంగాణలో 2 వారాల్లో రూ. 42.72 కోట్లు రాబట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 4.70 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 5.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.14 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 57.66 కోట్లు షేర్‌, రూ. 104.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 2 వారాల్లో దీనికి రూ. 57.66 కోట్లు కలెక్ట్ అయ్యాయి. అంటే మరో రూ. 16.34 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

ఓన్ రిలీజ్.. కొన్ని ప్రాంతాల్లోనే

ఓన్ రిలీజ్.. కొన్ని ప్రాంతాల్లోనే

టాలీవుడ్ స్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రానికి ఆరంభంలో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, వీక్ డేస్ నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. ఇక, ఈ సినిమాను సొంతంగానే రిలీజ్ చేసినట్లు నిర్మాత ఇప్పటికే వెల్లడించారు. దీంతో చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసిందట. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం టార్గెట్ రావాల్సి ఉందని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X