Godfather Official Collections: 4వ రోజు అరాచకం.. అప్పుడే అన్ని కోట్లు.. మరో రికార్డుకు చేరువైన చిరు
సుదీర్ఘ కాలంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ ప్రేక్షకులను అలరిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో సత్తా చాటుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఏజ్‌తో అస్సలు సంబంధం లేకుండా కనిపించే ఆయన.. రీఎంట్రీలో మరింత వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే 'గాడ్ ఫాదర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ 4 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

గాడ్ ఫాదర్‌గా వచ్చేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి - మోహన్ రాజా కాంబినేషన్‌లో వచ్చిన మూవీనే 'గాడ్ ఫాదర్'. ఈ మూవీని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో విలక్షణ హీరో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించారు. ఇది మలయాళ చిత్రం 'లూసీఫర్'కు రీమేక్‌గా వచ్చింది. థమన్ దీనికి సంగీతాన్ని అందించాడు.

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే
భారీ అంచనాలతో విడుదలైన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 35 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 70.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6.50 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 91 కోట్ల బిజినెస్ జరిగింది.

4వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'గాడ్ ఫాదర్'కు ఆంధ్రా, తెలంగాణలో 4వ రోజు కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.08 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 91 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, గుంటూరులో రూ. 42 లక్షలు, కృష్ణాలో రూ. 35 లక్షలు, నెల్లూరులో రూ. 30 లక్షలతో కలిపి రూ. 5.62 కోట్లు షేర్, రూ. 9.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

4 రోజులకు కలిపి ఎంతొచ్చింది
నాలుగు రోజుల్లో 'గాడ్ ఫాదర్'కు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.35 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.07 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.89 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.60 కోట్లు, గుంటూరులో రూ. 3.15 కోట్లు, కృష్ణాలో రూ. 1.93 కోట్లు, నెల్లూరులో రూ. 1.46 కోట్లతో కలిపి రూ. 31.73 కోట్లు షేర్, రూ. 52.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా తెలంగాణలో 4 రోజుల్లో రూ. 31.73 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 3.15 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 3.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.80 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 42.43 కోట్లు షేర్, రూ. 77.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 91 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 92 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 42.43 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 49.57 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

మరో 8 కోట్లు వసూలు చేసిందంటే
మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ ఈ మూవీ రూ. 42.43 కోట్లు వసూలు చేసింది. అలాగే, మరో రూ. 8 కోట్లు రాబడితే యాభై కోట్ల క్లబ్‌లో చేరుతుంది. అదే జరిగితే చిరంజీవి ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరుతుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications











