Godfather Official Collections: ఆదివారం ఊహించని వసూళ్లు.. అన్ని కోట్లతో చిరంజీవి సంచలన రికార్డు

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సుదీర్ఘ కాలం పాటు కష్టనష్టాలను అనుభవించిన తర్వాత టాలీవుడ్‌ నెంబర్ వన్ హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోన్న ఆయన.. వరుస సినిమాలతో సత్తా చాటుతోన్నారు. మరీ ముఖ్యంగా రీఎంట్రీలో ఫుల్ జోష్‌తో ఉన్న చిరంజీవి ఇటీవలే 'గాడ్ ఫాదర్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' మూవీ 5 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

గాడ్ ఫాదర్‌గా మారిన చిరంజీవి

గాడ్ ఫాదర్‌గా మారిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'గాడ్ ఫాదర్'. ఈ మూవీని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో విలక్షణ హీరో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించారు. ఇది మలయాళ చిత్రం 'లూసీఫర్'కు రీమేక్‌గా వచ్చింది. థమన్ దీనికి సంగీతం ఇచ్చాడు.

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

రాజకీయ నేపథ్యంతో వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 35 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 70.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6.50 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 91 కోట్ల బిజినెస్ అయింది.

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

5వ రోజు 'గాడ్ ఫాదర్'కు ఆంధ్రా, తెలంగాణలో రెస్పాన్స్ తగ్గలేదు. ఫలితంగా నైజాంలో రూ. 1.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 96 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 86 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 44 లక్షలు, కృష్ణాలో రూ. 38 లక్షలు, నెల్లూరులో రూ. 30 లక్షలతో కలిపి రూ. 5.23 కోట్లు షేర్, రూ. 8.50 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

5 రోజులకు కలిపి ఎంతొచ్చింది

5 రోజులకు కలిపి ఎంతొచ్చింది

'గాడ్ ఫాదర్'కు ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 10.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.31 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.93 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.25 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.88 కోట్లు, గుంటూరులో రూ. 3.59 కోట్లు, కృష్ణాలో రూ. 2.31 కోట్లు, నెల్లూరులో రూ. 1.76 కోట్లతో కలిపి రూ. 36.96 కోట్లు షేర్, రూ. 61.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఆంధ్రా తెలంగాణలో 5 రోజుల్లో రూ. 36.96 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 4.25 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 4.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.30 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 50.11 కోట్లు షేర్‌, రూ. 91.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

క్రేజీ కాంబోలో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 91 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 92 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 50.11 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 41.89 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

చిరంజీవి రికార్డు.. అక్కడ కూడా

చిరంజీవి రికార్డు.. అక్కడ కూడా

మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఐదు రోజుల్లోనే ఈ మూవీ రూ. 50 కోట్ల షేర్ మార్కును చేరుకుని రికార్డు క్రియేట్ చేసింది. అలాగే, ఓవర్సీస్‌లో ఒక మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటేసింది. తద్వారా ఒకేరోజు చిరంజీవి రెండు ఘనతలు అందుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X