twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Godfather Official Collections: భారీగా పడిపోయిన వసూళ్లు.. అన్ని కోట్లు డౌన్.. బాలయ్య రికార్డు బ్రేక్

    |

    సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. గతంలో కంటే ఇప్పుడు వేగంగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్న ఆయన.. ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ స్టార్ హీరో 'గాడ్ ఫాదర్' అనే చిత్రంతో వచ్చేశారు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. అందుకు అనుగుణంగానే దీనికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. అయితే, సోమవారం మాత్రం వసూళ్లు డౌన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' మూవీ 6 రోజుల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

    గాడ్ ఫాదర్‌గా ఎంట్రీ ఇచ్చేశారు

    గాడ్ ఫాదర్‌గా ఎంట్రీ ఇచ్చేశారు

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రమే 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించారు. థమన్ దీనికి సంగీతం ఇచ్చాడు. ఇది మలయాళ చిత్రం 'లూసీఫర్'కు రీమేక్‌గా వచ్చింది.

    Rashmika Vijay Marriage: సీక్రెట్‌గా రష్మిక, విజయ్ పెళ్లి.. ఫొటో వైరల్.. మరీ ఇంతకు తెగించారేంటి!Rashmika Vijay Marriage: సీక్రెట్‌గా రష్మిక, విజయ్ పెళ్లి.. ఫొటో వైరల్.. మరీ ఇంతకు తెగించారేంటి!

    గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

    గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

    పొలిటికల్ యాక్షన్‌తో వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 35 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 70.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6.50 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 91 కోట్ల బిజినెస్ జరిగింది.

    6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    'గాడ్ ఫాదర్'కు ఆంధ్రా, తెలంగాణలో 6వ రోజు బిగ్ షాక్ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 44 లక్షలు, సీడెడ్‌లో రూ. 41 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 23 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి రూ. 1.51 కోట్లు షేర్, రూ. 2.30 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

    షర్ట్ విప్పేసిన యాంకర్ మంజూష: హాట్ షోలో అస్సలు తగ్గట్లేదుగా!షర్ట్ విప్పేసిన యాంకర్ మంజూష: హాట్ షోలో అస్సలు తగ్గట్లేదుగా!

    6 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    6 రోజులకు కలిపి ఎంతొచ్చింది


    'గాడ్ ఫాదర్'కు ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.37 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.71 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.16 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.35 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.98 కోట్లు, గుంటూరులో రూ. 3.66 కోట్లు, కృష్ణాలో రూ. 2.40 కోట్లు, నెల్లూరులో రూ. 1.84 కోట్లతో కలిపి రూ. 38.47 కోట్లు షేర్, రూ. 63.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    6 రోజుల్లో ఆంధ్రా తెలంగాణలో రూ. 38.47 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 4.40 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 4.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.50 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 51.77 కోట్లు షేర్‌, రూ. 93.95 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    బ్రాతో యాంకర్ శ్రీముఖి తెగింపు: ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!బ్రాతో యాంకర్ శ్రీముఖి తెగింపు: ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 91 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 92 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 51.77 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 40.23 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

    భారీగా డౌన్.. బాలయ్య రికార్డ్ బ్రేక్

    భారీగా డౌన్.. బాలయ్య రికార్డ్ బ్రేక్

    మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రానికి ఆరో రోజు మాత్రం కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఇదిలా ఉండగా.. ఈ మూవీ ఓవర్సీస్‌లో ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటింది. దీంతో చిరంజీవి ఈ ఫీట్‌ను మూడుసార్లు అందుకుని సీనియర్ హీరోల్లో నెంబర్ వన్ ప్లేస్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే 2 చిత్రాలతో ఉన్న నందమూరి బాలకృష్ణ రికార్డును దాటేశారు.

    English summary
    Megastar Chiranjeevi Did Godfather Movie Under Mohan Raja Direction. This Movie Collect 51.77 Cr in 6 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X