Godfather Collections:'గాడ్ ఫాదర్' కు రావాల్సింది రూ. 92 కోట్లు.. కానీ 8 రోజుల్లో వచ్చింది ఇంతే!

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. గతంలో కంటే ఇప్పుడు వేగంగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్న ఆయన.. ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ స్టార్ హీరో 'గాడ్ ఫాదర్' అనే చిత్రంతో వచ్చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది.

తొలి రోజు తక్కువ ఓపెనింగ్స్ అందుకున్న మౌత్ టాక్ అదిరిపోయింది. దీంతో రెండో రోజు స్ట్రాంగ్ కలెక్షన్లు వచ్చాయి. కానీ మొదటి వారం పూర్తయి రెండో వారంలోకి అడుగుపెట్టేసరికి వసూళ్లు తారుమారు అయ్యాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ 8 రోజుల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం!

'లూసీఫర్'కు రీమేక్‌గా..

'లూసీఫర్'కు రీమేక్‌గా..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రమే 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించారు. థమన్ దీనికి సంగీతం ఇచ్చాడు. ఇది మలయాళ చిత్రం 'లూసీఫర్'కు రీమేక్‌గా వచ్చింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా..

ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా..

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 35 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 70.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6.50 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 91 కోట్ల బిజినెస్ అయింది.

 తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు కలెక్షన్లు..

తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు కలెక్షన్లు..

8వ రోజు 'గాడ్ ఫాదర్'కు ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 62 లక్షలు షేర్, రూ. 95 లక్షల గ్రాస్ వసూలు చేసింది.

8 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చిందంటే?

8 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చిందంటే?

'గాడ్ ఫాదర్' 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 11.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.41 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.48 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.10 కోట్లు, గుంటూరులో రూ. 3.75 కోట్లు, కృష్ణాలో రూ. 2.50 కోట్లు, నెల్లూరులో రూ. 1.90 కోట్లతో కలిపి రూ. 39.92 కోట్లు షేర్, రూ. 65.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంతంటే?

8 రోజుల్లో ఆంధ్రా తెలంగాణలో రూ. 39.92 కోట్లు రాబట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 4.54 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 4.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.81 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 53.92 కోట్లు షేర్‌, రూ. 97.80 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ఇంకెంత రావాలంటే..?

ఇంకెంత రావాలంటే..?

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 91 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 92 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి రూ. 53.92 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 38.08 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

అమెరికాలో మాత్రం..

అమెరికాలో మాత్రం..

ఇదిలా ఉంటే యూఎస్ బాక్సాఫీస్ వద్ద మాత్రం గాడ్ ఫాదర్ తన జెండా పాతాడు. యూఎస్ఏలో వన్ మిలియన్ డాలర్లు అంటే రూ. 9 కోట్లు వసూళు చేయగా ఆస్ట్రేలియా, దుబాయ్ ఇతర దేశాల్లో అంతకుమించిన వసూళ్లు సాధించిందని సమాచారం. అంతేకాకుండా చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటించిన గాడ్ ఫాదర్ కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. మొన్నటి వీకెండ్ లోనే ఈ మార్క్ అందుకుని సత్తా చాటాడు గాడ్ ఫాదర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X