Godfather Official Collections: 9వ రోజు దారుణంగా.. చిరంజీవికి బిగ్ షాక్.. అన్ని కోట్లు వస్తేనే హిట్
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. గొప్ప గొప్ప హీరోల పోటీని ఎదుర్కొని.. స్టార్‌గా ఎదిగిపోయారు చిరంజీవి. నటన, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న ఆయన.. సుదీర్ఘ కాలంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనే చిత్రంతో వచ్చారు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చిన ఈ మూవీకి కలెక్షన్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' మూవీ 9 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

గాడ్ ఫాదర్‌గా వచ్చేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన చిత్రమే 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా రూపొందించిన ఈ మూవీని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఎస్ థమన్ దీనికి సంగీతం ఇచ్చాడు. ఇది మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం 'లూసీఫర్'కు రీమేక్‌గా వచ్చిన విషయం తెలిసిందే.

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే
రాజకీయ నేపథ్యంతో వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 35 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 70.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6.50 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 91 కోట్ల బిజినెస్ జరిగింది.

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'గాడ్ ఫాదర్'కు 9వ రోజు ఆంధ్రా, తెలంగాణలో బాగా డౌన్ అయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 8లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 47 లక్షలు షేర్, రూ. 70 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.

9 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
9 రోజుల్లో 'గాడ్ ఫాదర్'కు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.81 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.49 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.53 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.15 కోట్లు, గుంటూరులో రూ. 3.79 కోట్లు, కృష్ణాలో రూ. 2.56 కోట్లు, నెల్లూరులో రూ. 1.93 కోట్లతో కలిపి రూ. 40.39 కోట్లు షేర్, రూ. 66.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా తెలంగాణలో 9 రోజుల్లో రూ. 40.39 కోట్లు రాబట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 4.57 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 4.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.87 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 54.53 కోట్లు షేర్, రూ. 99.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
చిరంజీవి హీరోగా నటించిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 91 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 92 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 54.53 కోట్లు కలెక్ట్ అయ్యాయి. అంటే మరో రూ. 37.47 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

కలెక్షన్లు డౌన్.. టార్గెట్ చేరుద్దా?
మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రానికి ఆరంభంలో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, వీక్ డేస్ నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. ఫలితంగా తొమ్మిది రోజులు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చాలా దూరంగానే ఉంది. దీంతో అసలు 'గాడ్ ఫాదర్' ఫుల్ రన్‌లో పూర్తి స్థాయి కలెక్షన్లను రాబడుతుందా అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











