Godfather Official Collections: మొదటి రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఆ రికార్డులు బ్రేక్ చేయని చిరంజీవి
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను, స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్న ఆయన.. తాజాగా 'గాడ్ ఫాదర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే స్పందన కూడా దక్కింది. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' మూవీ మొదటి రోజు కలెక్షన్లను చూద్దాం పదండి!

గాడ్ ఫాదర్‌గా ఎంటరైన చిరంజీవి
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రమే 'గాడ్ ఫాదర్'. దీన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో విలక్షణ హీరో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించారు. థమన్ దీనికి సంగీతం సమకూర్చాడు. ఈ మూవీ 'లూసీఫర్'కు రీమేక్‌గా తెరకెక్కింది.

గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 35 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 70.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6.50 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 91 కోట్ల బిజినెస్ చేసింది.

అలాంటి టాక్.. కలెక్షన్లు సునామీ
ఎన్నో అంచనాల నడుమ రూపొందిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మంచి రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డేన అత్యధిక కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడించారు.

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'గాడ్ ఫాదర్' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.29 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.26 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.60 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 59 లక్షలు, గుంటూరులో రూ. 1.75 కోట్లు, కృష్ణాలో రూ. 73 లక్షలు, నెల్లూరులో రూ. 57 లక్షలతో కలిపి రూ. 12.97 కోట్లు షేర్, రూ. 21.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 12.97 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 74 లక్షలు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 45 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 16.26 కోట్లు షేర్, రూ. 38 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 91 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 92 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 16.26 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 75.74 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

చిరంజీవి కెరీర్‌లోనే తక్కువగా
మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు ఓపెనింగ్ డేన ఆంధ్రా, తెలంగాణలో అదిరిపోయే కలెక్షన్లు వస్తుంటాయి. అయితే, 'గాడ్ ఫాదర్'కు మాత్రం రూ. 12.97 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత 'ఖైదీ నెంబర్ 150'కి రూ. 23.25 కోట్లు, సైరాకు రూ. 38.75 కోట్లు, ఆచార్యకు రూ. 29.50 కోట్లు వచ్చాయి. అంటే వాటిని ఈ చిత్రం దాటలేకపోయింది.


Click it and Unblock the Notifications











