Godfather Collections: బాస్ ఈజ్ బ్యాక్.. చిరంజీవి గాడ్ ఫాదర్ కు రెండో రోజు స్ట్రాంగ్ కలెక్షన్లు!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన మార్క్ చూపించి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. వైవిధ్యమైన సినిమాల్లో నటించి, తన యాక్టింగ్, డ్యాన్స్, అభినయంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సినిమాల్లో బాస్ అయ్యాడు. సుమారు 40 ఏళ్లుగా తెలుగు చిత్రసీమలో తన హవాను చాటుతున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళం హిట్ మూవీ లూసీఫర్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 5న అనేక అంచనాల నడుమ చాలా గ్రాండ్ గా విడుదలైంది. విడుదలై మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ స్ట్రాంగ్ ఉన్నాయని సినీ పండితులు చెబుతున్నారు. మరి ఆ వివరాలేంటో చూద్దామా!

బాస్ ఈజ్ బ్యాక్ అంటూ..

బాస్ ఈజ్ బ్యాక్ అంటూ..

సుమారు 40 ఏళ్లుగా తెలుగు చిత్రసీమలో తన హవాను చూపిస్తూ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గని ఎనర్జీతో దూసుకుపోతున్నారు చిరంజీవి. ఇటీవల ఆచార్యతో పరాజయం పొందిన చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో గాడ్ ఫాదర్ ఒకటి. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమెక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గ్రాండ్ గా అక్టోబర్ 5న విడుదలైంది. తొలి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు, ప్రేక్షకులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర..

బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర..


చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది. హిట్ టాక్ వచ్చిన గాడ్ ఫాదర్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 38 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక గాడ్ ఫాదర్ మూవీ రెండో రోజున వరల్డ్ వైడ్ గా రూ. 31 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. అయితే సాధారణంగా ప్రతి స్టార్ హీరోకు మొదటి రోజు కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. రెండో రోజుకు ఆ కలెక్షన్లు 20 నుంచి 30 శాతం పడిపోతాయి. కానీ, గాడ్ ఫాదర్ విషయంలో మాత్రం అలా జరగలేదు. రెండో రోజు కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టింది చిరంజీవి గాడ్ ఫాదర్. మొత్తంగా రెండు రోజుల్లో గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 69 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

 మరింతగా కలెక్షన్లు పెరగే అవకాశం..

మరింతగా కలెక్షన్లు పెరగే అవకాశం..

ఈ వారంలో దసరా సెలవులు ఉండటం, వీకెండ్ లలో ఎక్కువగా సినిమాలు చూస్తారు కాబట్టి గాడ్ ఫాదర్ మూవీకి మరింతగా కలెక్షన్లు పెరగవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక గాడ్ ఫాదర్ సినిమాను హిందీలో కూడా విడుదల చేశారు. బాలీవుడ్ లో గాడ్ ఫాదర్ కు మొదటి రోజు రూ. మూడున్నర కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. రెండో రోజు ఇంకాస్తా పెరిగే అవకాశం ఉంది. నేటి నుంచి థియేటర్ల కౌంట్ పెరగనున్న కారణంగా గాడ్ ఫాదర్ కు డబుల్ కలెక్షన్లు రావొచ్చని సినీ క్రిటిక్స్ అంచనా.

ఎక్కువగా థియేటర్లు లభించలేదు..

ఎక్కువగా థియేటర్లు లభించలేదు..

బాలీవుడ్ లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన విక్రమ్ వేద మూవీ లాస్ట్ వీక్ విడుదలైంది. చాలా థియేటర్లలో ఆ సినిమా ప్రదర్శించడంతో గాడ్ ఫాదర్ మూవీకి ఎక్కువగా థియేటర్లు లభించలేదు. ఈరోజు నుంచి విక్రమ్ వేద మూవీ తొలగించి చిరంజీవి గాడ్ ఫాదర్, అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్నా నటించిన గుడ్ బై సినిమాలను ప్రదర్శించనున్నారు. అయితే గాడ్ ఫాదర్ మూవీలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర చేయడంతో ఉత్తరాది ప్రేక్షకులు, సల్లూ భాయ్ అభిమానులు ఈ చిత్రంపై ఆసక్తి చూపిస్తునట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X