MSVPG Day 10 Box Office Collections: బాక్సాఫీస్ దగ్గర శంకర వర ప్రసాద్ రచ్చ.. చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లంటే ?
Mana Shankara Vara Prasad Garu Collections: సంక్రాంతి కానుకగా విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి దూసుకెళ్తోంది. విడుదలకు ముందే భారీ బజ్ ఉన్న ఈ సినిమా, రిలీజ్ అయిన తొలి రోజు నుంచే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, ఫెస్టివ్ సీజన్ అడ్వాంటేజ్ కలిసి రావడంతో సినిమా బాక్సాఫీస్ పరుగులు ఆపకుండా కొనసాగిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్‌ను చేరుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో మన శంకర వర ప్రసాద్ గారు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? పదో రోజు 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
దర్శకుడు అనిల్ రావిపూడి మాస్-ఫ్యామిలీ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా నయనతార, గెస్ట్ రోల్ లో వెంకటేష్ కనిపించడంతో సినిమాపై ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అలాగే చిరంజీవి వింటేజ్ కామెడీ, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను థియేటర్లకు లాగుతున్నాయి. చాలా రోజుల తర్వాత చిరంజీవిని పూర్తి స్థాయి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో చూడటం మెగా ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు సుమారు రూ.105 కోట్లకు క్లోజ్ అయ్యాయని ట్రేడ్ సమాచారం. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలను కలుపుకొని చూస్తే ఇండియా థియేట్రికల్ బిజినెస్ మొత్తం రూ.120 కోట్ల వరకు చేరినట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమా మంచి డిమాండ్ సృష్టించింది.
ముఖ్యంగా నార్త్ అమెరికా రైట్స్ సుమారు రూ.20 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. దీంతో ఓవర్సీస్ బిజినెస్ కూడా ట్రేడ్ వర్గాలను ఆకట్టుకునే స్థాయిలో నమోదైంది. మొత్తం కలిపి చూస్తే, వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140 నుంచి 150 కోట్ల మధ్య జరిగినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం, థియేట్రికల్ బ్రేక్‌ఈవెన్ చేరాలంటే సినిమా దాదాపు రూ.280-300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంది. అయితే రిలీజ్ తర్వాత వచ్చిన భారీ ఓపెనింగ్స్, తొలి వారం కలెక్షన్లతోనే ఈ సినిమా బ్రేక్‌ఈవెన్‌ను దాటడం ట్రేడ్‌కు పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది.
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. సినిమా ప్రీమియర్ షోలుగా పరిగణించే డే 0 (ఆదివారం) రోజే దేశవ్యాప్తంగా రూ. 11.25 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇందులో ఏపీ, తెలంగాణ నుంచే రూ. 9.75 కోట్లు రావడం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపించింది. కర్ణాటక నుంచి రూ. 1.3 కోట్లు రావడం కూడా మొదటి రోజు పరంగా మంచి ఆరంభంగా చెప్పవచ్చు. ఫుల్ రన్ మొదలైన డే 1 (మొదటి సోమవారం) రోజున కలెక్షన్లు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. మొత్తం రోజువారీ గ్రాస్ రూ. 38.75 కోట్లకు చేరింది. ఇందులో ఏపీ, తెలంగాణ వాటా రూ. 35 కోట్లు కావడం గమనార్హం. ఇది ఈ సినిమా ప్రధాన బలంగా తెలుగు మార్కెట్ నిలిచిందని స్పష్టం చేస్తోంది. కర్ణాటకలోనూ రూ. 2.85 కోట్లు అందుకుంది.
ఇక రెండో రోజు నుంచి నాలుగోరోజు వరకు సినిమా నిలకడగా కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు రూ.22.15 కోట్లు, మూడో రోజు రూ. 23 కోట్లు, నాలుగోవ రోజు రూ. 26.1 కోట్ల గ్రాస్ నమోదు అయ్యాయి. వర్కింగ్ డేస్‌లోనూ ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్‌కు పాజిటివ్ సిగ్నల్‌గా మారింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ప్రతిరోజూ రూ. 19 -21 కోట్ల మధ్య కలెక్షన్లు రావడం చూస్తే మెగాస్టార్ సత్తా ఎంటో అర్థమవుతోంది.
మొదటి వీకెండ్ ముగిసే సమయానికి సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తి ఆధిపత్యం చెలాయించింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు కూడా రోజుకు రూ. 20 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇక డే 7 (మొదటి ఆదివారం) వరకు సినిమా దాదాపు రూ. 194 కోట్లకు చేరువగా వసూలు చేసింది. ఈ దశలోనే రూ. 200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే సూచనలు స్పష్టంగా కనిపించాయి. ఇక రెండో వారం ప్రారంభంలో కొంత డ్రాప్ కనిపించింది. ఇక ఎనిమిదో రోజు రూ. 9.5 కోట్లు, తొమ్మిదో రోజు రూ. 6.75 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా 9 రోజుల్లో దేశవ్యాప్తంగా రూ. 203.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసి, రూ. 200 కోట్ల మైలురాయిని దాటింది.
అలాగే.. 9 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్లు మొత్తం రూ. 242.25 కోట్లకు చేరడం విశేషం. స్టేట్ వైజ్ కలెక్షన్లను పరిశీలిస్తే.. ఏపీ, తెలంగాణ నుంచే రూ. 179 కోట్ల భారీ వసూళ్లు రావడం చూస్తే మెగాస్టార్ క్రేజ్ ఏంటో తెలుస్తోంది. ఇక కర్ణాటకలో రూ. 18.43 కోట్లు, తమిళనాడులో రూ. 2.65 కోట్లు, కేరళలో రూ. 0.12 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 3.65 కోట్ల కలెక్షన్లు అందుకుంది. ఇలా తొమ్మిది రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి (ఇండియా వైడ్) చేరి సంక్రాంతి సీజన్ బాక్సాఫీస్ విజేతగా నిలిచింది.
ఇక పదో రోజు ( బుధవారం) కలెక్షన్స్ కాస్త తగ్గినట్టు అంచనా.. ఆంధ్రప్రదేశ్, నైజాంలో కలిపి రూ.5-6 కోట్ల వరకు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.1 కోటి, ఓవర్సీస్‌లో దాదాపు రూ.0.5 కోటి వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన పదో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.7-8 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం..మొత్తం పది రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 215-216 కోట్ల వరకు (నెట్ కలెక్షన్స్) సాధించవచ్చని అంచనా.
ఇదిలా ఉంటే.. చిరంజీవి మూవీ కలెక్షన్ల పరంగా రచ్చ చేస్తోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. మూవీ మేకర్స్ ప్రకారం..మన శంకర వర ప్రసాద్ గారు సినిమా చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. ఈ మూవీ విడుదలైన కేవలం 9 రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ప్రత్యేక ప్రోమోను విడుదల చేసింది. మరోవైపు నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమా 3 మిలియన్ డాలర్ల మార్కును దాటి దూసుకుపోతోంది. అలాగే..అలాగే ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది టాప్ గ్రాసర్ల జాబితాలో నిలిచింది. ఈ సినిమాతో డైరెక్టర్ గా అనిల్ రావిపూడి వరుసగా 9వ విక్టరీ ఖాతాలో వేసుకున్నారు.


Click it and Unblock the Notifications











