MSVPG Day 11 Box Office Collections: బాక్సాఫీస్ కా బాస్.. అంతటా మెగాస్టార్ క్రేజ్.. చిరు మూవీకి ఎన్ని కోట్లంటే

Mana Shankara Vara Prasad Garu Collections: సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి దూసుకెళ్తోంది. విడుదలకు ముందే భారీ బజ్ ఉన్న ఈ సినిమా, రిలీజ్ అయిన తొలి రోజు నుంచే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూళ్లు నమోదు చేసింది. ఫెస్టివ్ సీజన్ అడ్వాంటేజ్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన భారీ స్పందన సినిమాకు బలంగా మారింది. కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్‌ను చేరుకోవడం విశేషంగా మారింది. ఈ నేపథ్యంలో మన శంకర వర ప్రసాద్ గారు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 11వ రోజు 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

దర్శకుడు అనిల్ రావిపూడి మాస్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ గా చూపించగా, చిరంజీవి వింటేజ్ కామెడీ, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు సినిమాకు పాజిటివ్ గా మారింది. హీరోయిన్‌గా నయనతార, గెస్ట్ రోల్‌లో వెంకటేష్ కనిపించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

Chiranjeevi movie Mana Shankara Varaprasad Garu Day 11 Expected Box Office Collections Worldwide

ట్రేడ్ సమాచారం ప్రకారం, సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు రూ.105 కోట్లకు, మొత్తం ఇండియా బిజినెస్ సుమారు రూ.120 కోట్లకు క్లోజ్ అయ్యాయి. ఓవర్సీస్‌లోనూ భారీ డిమాండ్ ఉండగా, నార్త్ అమెరికా రైట్స్ సుమారు రూ.20 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. మొత్తం కలిపి వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. ఈ లెక్కల ప్రకారం థియేట్రికల్ బ్రేక్‌ఈవెన్ కోసం భారీ గ్రాస్ అవసరమైనా, స్ట్రాంగ్ ఓపెనింగ్స్, తొలి వారం వసూళ్లతోనే సినిమా బ్రేక్‌ఈవెన్‌ను దాటడం ట్రేడ్ వర్గాలకు పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. సినిమా ప్రీమియర్ రోజే దేశవ్యాప్తంగా రూ. 11.25 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇందులో ఏపీ, తెలంగాణ నుంచే రూ. 9.75 కోట్లు రావడం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపించింది. కర్ణాటక నుంచి రూ. 1.3 కోట్లు రావడం కూడా మొదటి రోజు పరంగా మంచి ఆరంభంగా చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ప్రీమియర్ షోలతోనే స్టాంగ్ ఓపెనింగ్ నమోదు చేయడం సినిమాకు మొదటి ప్లస్‌గా మారింది. తొలిరోజు రూ.32.25 కోట్లు వసూలు చేసింది. ఇది సినిమాపై ఉన్న అంచనాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో రోజు కూడా అదే ఊపు కొనసాగుతూ రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు వసూలు చేసింది.

వీక్‌డేస్‌లోనూ సినిమా వసూళ్లు తగ్గలేదు. నాలుగో రోజు రూ. 22 కోట్లు రావడం విశేషం కాగా, ఐదో రోజు రూ.19.5 కోట్లు, ఆరో రోజు రూ.18.9 కోట్లు వసూలు చేసింది. మొదటి వారం చివరి రోజు అయిన ఏడోవ రోజు రూ.17.65 కోట్లు అందుకుంది. రెండో వారం ప్రారంభంలో కొంత డ్రాప్ కనిపించినప్పటికీ, కలెక్షన్లు పూర్తిగా పడిపోలేదు. ఇక 8 రోజున రూ. రూ 8 కోట్లు, 9 వ రోజు రూ. 5.75 కోట్లు, 10 రోజున రూ. 4.2 కోట్లు వసూలు చేస్తూ స్ట్రాంగ్ కలెక్షన్లతో ముందుకు సాగుతోంది.

ఇక స్టేట్ వైస్ కలెక్షన్స్ చూస్తూ.. మన శంకర వరప్రసాద్ తెలుగు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు నమోదు చేస్తోంది. ట్రేడ్ నివేదికల ప్రకారం, ఏపీ - తెలంగాణలో రూ. 183.35 కోట్లు వసూలు చేయగా, కర్ణాటక నుంచి రూ 18.73 కోట్లు, తమిళనాడు నుంచి రూ.2.69 కోట్లు, కేరళ నుంచి రూ. 0.12 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 3.71 కోట్లు రాబట్టింది. అన్ని రాష్ట్రాలను కలిపి చూస్తే, పది రోజుల్లో ఇండియా వైడ్ గా మొత్తం గ్రాస్ కలెక్షన్ రూ 208.6 కోట్లకు చేరింది. ఈ స్థాయి వసూళ్లతో సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ రన్ కొనసాగిస్తోంది.

ఇక 11వ రోజు (గురువారం) కలెక్షన్స్ కాస్త తగ్గినట్టు అంచనా.. ఆంధ్రప్రదేశ్, నైజాంలో కలిపి రూ.5 కోట్ల వరకు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ. 0.5 కోటి, ఓవర్సీస్‌లో దాదాపు రూ.0.5కోటి వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన పదో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.5-6 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం..మొత్తం 11 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 215 కోట్ల వరకు (నెట్ కలెక్షన్స్) సాధించవచ్చని అంచనా.

ఇదిలా ఉంటే.. చిరంజీవి మూవీ కలెక్షన్ల పరంగా రచ్చ చేస్తోంది. మన శంకర్ వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులతో దూసుకెళ్లింది. విడుదలైన పది రోజుల లోపే చిరంజీవి సినిమా వరల్డ్‌వైడ్ రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి, అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కొనసాగించడం విశేషం.

ఇక మొదటి వారం విషయానికి వస్తే, ఈ చిత్రం రూ.157.75 కోట్ల నెట్ కలెక్షన్ నమోదు చేసి, పాన్ ఇండియన్ సినిమాలను మినహాయించి తెలుగు సినిమాల్లో కొత్త రికార్డును సృష్టించింది. గతంలో RRR తొలి వారం రూ.298 కోట్లు, బాహుబలి 2 రూ.202 కోట్లు వసూలు చేయగా, వాటి తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' (రూ.152 కోట్లు), 'సైరా నరసింహారెడ్డి' (రూ.137 కోట్లు) మాత్రమే ఉన్నాయి. ఈ లిస్టులో ఇప్పుడు 'మన శంకర్ వరప్రసాద్ గారు' వాటన్నింటినీ వెనక్కి నెట్టుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X