MSVPG Day 12 Box Office Collections: బాక్సాఫీస్ ముందు కాలర్ ఎగరేసిన మెగాస్టార్..వరప్రసాద్ కి ఎన్ని కోట్లంట్లే?

Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై,తొలి రోజు నుంచే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూళ్లు నమోదు చేసింది. ఫెస్టివ్ సీజన్ అడ్వాంటేజ్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన భారీ స్పందన అందించింది. కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్‌ను చేరుకోవడం విశేషంగా మారింది. విడుదలకు ముందే భారీ బజ్ ఉన్న ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 12 వ రోజు 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

దాదాపు నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో మాస్, యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి, తొలిసారి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ముందుకు రావడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన భారీ స్పందనతో పాటు, చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. విడుదలకు ముందే భారీ బజ్ ఏర్పడిన ఈ సినిమా, రిలీజ్ అయిన తొలి రోజు నుంచే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే వసూళ్లు నమోదు చేసింది. ఫెస్టివ్ సీజన్ అడ్వాంటేజ్, ఫ్యామిలీ ప్రేక్షకుల మద్దతుతో కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్ చేరుకోవడం విశేషంగా మారింది.

Chiranjeevi movie Mana Shankara Varaprasad Garu Day 12 Expected Box Office Collections Worldwide

దర్శకుడు అనిల్ రావిపూడి మాస్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ను సమతుల్యంగా చూపించగా, చిరంజీవి వింటేజ్ కామెడీ, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు సినిమాకు బలంగా నిలిచాయి. హీరోయిన్ నయనతార, గెస్ట్ రోల్‌లో వెంకటేష్ కనిపించడం అంచనాలను మరింత పెంచింది. ట్రేడ్ అంచనాల ప్రకారం, భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఉన్నప్పటికీ, స్ట్రాంగ్ ఓపెనింగ్స్‌తో తొలి వారం లోపే బ్రేక్‌ఈవెన్ దాటడం సినిమాకు మరో ప్లస్‌గా మారింది.

ట్రేడ్ సమాచారం ప్రకారం, సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు రూ.105 కోట్లకు, మొత్తం ఇండియా బిజినెస్ సుమారు రూ.120 కోట్లకు క్లోజ్ అయ్యాయి. ఓవర్సీస్‌లోనూ భారీ డిమాండ్ ఉండగా, నార్త్ అమెరికా రైట్స్ సుమారు రూ.20 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. మొత్తం కలిపి వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. ఈ లెక్కల ప్రకారం థియేట్రికల్ బ్రేక్‌ఈవెన్ కోసం భారీ గ్రాస్ అవసరమైనా, స్ట్రాంగ్ ఓపెనింగ్స్, తొలి వారం వసూళ్లతోనే సినిమా బ్రేక్‌ఈవెన్‌ను దాటడం ట్రేడ్ వర్గాలకు పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది.

కలెక్షన్ల పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ప్రీమియర్ రోజే దేశవ్యాప్తంగా రూ.11.25 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఇందులో ఏపీ-తెలంగాణ నుంచే రూ.9.75 కోట్లు రావడం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపించింది. తొలిరోజు మొత్తం రూ.32.25 కోట్ల భారీ వసూళ్లతో స్ట్రాంగ్ ఓపెనింగ్ నమోదు చేసింది. ఆ తర్వాత కూడా అదే ఊపు కొనసాగిస్తూ రెండో రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు వసూలు చేసింది.

వీక్‌డేస్‌లోనూ తగ్గకుండా నాలుగో రోజు రూ.22 కోట్లు, ఐదో రోజు రూ.19.5 కోట్లు, ఆరో రోజు రూ.18.9 కోట్లు రాబట్టగా, ఏడో రోజు రూ.17.65 కోట్లతో మొదటి వారం బలంగా ముగిసింది. రెండో వారం ప్రారంభంలో కొంత డ్రాప్ ఉన్నా, 11 రోజుల్లో సినిమా అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేసింది. ట్రేడ్ సమాచారం ప్రకారం 11 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ రూ.179.15 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.212.60 కోట్లు కాగా, ఓవర్సీస్‌లో రూ.41.15 కోట్లు వసూలు చేసి, వరల్డ్‌వైడ్‌గా మొత్తం రూ.253.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ స్థాయి వసూళ్లు సినిమాపై ఉన్న భారీ ఆదరణకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఇక 12వ రోజు (శుక్రవారం)కలెక్షన్స్ కాస్త తగ్గినట్టు అంచనా.. ఆంధ్రప్రదేశ్, నైజాంలో కలిపి రూ. 4 కోట్ల వరకు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ. 0.5 కోటి, ఓవర్సీస్‌లో దాదాపు రూ.0.5 కోటి వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన పదో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.4 -5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం..మొత్తం 12 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.218- 220 కోట్ల వరకు (నెట్ కలెక్షన్స్) సాధించవచ్చని అంచనా.

ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన పది రోజుల లోపే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి, చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రిలీజ్ నుంచి నిరంతరం స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కొనసాగించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక తొలి వారం కలెక్షన్ల పరంగా చూస్తే, ఈ సినిమా రూ.157.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించి, పాన్ ఇండియా సినిమాలను మినహాయించి తెలుగు సినిమాల్లో కొత్త రికార్డు సృష్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X