MSVPG Day 13 Box Office Collections: ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్.. మెగాస్టార్ మూవీకి ఎన్ని కోట్లంట్లే?
Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ఇండస్ట్రీ రికార్డులతో దూసుకుపోతోంది. విడుదలకు ముందే భారీ బజ్ ఉన్న ఈ సినిమా, రిలీజ్ అయిన తొలి రోజు నుంచే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూళ్లు నమోదు చేసింది. ఫెస్టివ్ సీజన్ అడ్వాంటేజ్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన భారీ స్పందన సినిమాకు బలంగా మారింది. కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్‌ను చేరుకోవడం విశేషంగా మారింది. ఈ నేపథ్యంలో 13వ రోజు 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
దర్శకుడు అనిల్ రావిపూడి మాస్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చూపించగా, మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ కామెడీ, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. హీరోయిన్‌గా నయనతార నటించగా, గెస్ట్ రోల్‌లో వెంకటేష్ కనిపించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విడుదల తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

ట్రేడ్ సమాచారం ప్రకారం.. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు రూ.105 కోట్లకు, మొత్తం ఇండియా బిజినెస్ సుమారు రూ.120 కోట్లకు క్లోజ్ అయ్యాయి. ఓవర్సీస్‌లోనూ భారీ డిమాండ్ ఉండగా, నార్త్ అమెరికా రైట్స్ సుమారు రూ.20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. మొత్తం కలిపి వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. ఈ లెక్కల ప్రకారం భారీ బ్రేక్‌ఈవెన్ అవసరమైనప్పటికీ, స్ట్రాంగ్ ఓపెనింగ్స్‌తో పాటు తొలి వారం వసూళ్లతోనే సినిమా బ్రేక్‌ఈవెన్‌ను దాటడం ట్రేడ్ వర్గాలకు పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది.
మన శంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ వసూళ్లలో ఎలాంటి తగ్గుదల చూపించలేదు. ఈ క్రమంలో చిరంజీవి కెరీర్‌లో ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'మన శంకర వర ప్రసాద్ గారు' నిలవడమే కాకుండా, మెగాస్టార్‌కు ఇది తొలి రూ.200 కోట్ల గ్రాసర్‌గా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఉన్నప్పటికీ, ఈ స్థాయి వసూళ్లు నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం సినీ వర్గాల్లో చర్చనీయంగా మారింది.
దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేసింది. మూవీ 12 రోజుల్లో ఇండియాలో రూ.204.75 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేయగా.. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ మూవీ 4.45 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.40.25 కోట్లు) గ్రాస్ వసూలు చేసింది. దీంతో వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ.245 కోట్లకు చేరుకున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే.. నైజాం ఏరియాలో రూ.62.25 కోట్లు, సీడెడ్‌లో రూ.26.75 కోట్లు, ఆంధ్ర ప్రాంతంలో రూ.90.75 కోట్లు గ్రాస్ వసూలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.179.75 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక నుంచి రూ.19.50 కోట్లు, తమిళనాడు-కేరళ నుంచి రూ.2.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి రూ.3 కోట్లు రావడంతో ఇండియా మొత్తం వసూళ్లు రూ.204.75 కోట్లకు చేరాయి.
ఇక 13 రోజు ( శనివారం) వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ముంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. భారతీయ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.5 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశముందట. ఈ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. శనివారం లేదా ఆదివారం నాటికి ఈ చిత్రం రూ.250 కోట్ల మార్క్‌ను దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా.
ఇదిలా ఉంటే.. చిరంజీవి మూవీ కేవలం బాక్సాఫీస్ వసూళ్ల పరంగానే కాకుండా, ప్రాంతీయంగా షేర్ కలెక్షన్స్‌లో కూడా ఇండస్ట్రీ హిస్టరీని తిరగరాస్తోంది. రెండో వారంలోనూ వసూళ్ల జోరు కొనసాగుతుండటంతో, రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన లేటెస్ట్ పోస్టర్‌తో ఈ సినిమా మరోసారి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సీడెడ్, ఈస్ట్ గోదావరి, నెల్లూరు ప్రాంతాల్లో ఇప్పటివరకు ఏ ప్రాంతీయ చిత్రానికీ దక్కని 'అత్యధిక షేర్ కలెక్షన్స్ సాధించిన సినిమా'గా మన శంకర వర ప్రసాద్ గారు 'ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ 'ను సొంతం చేసుకుంది.
సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత సినిమాల వసూళ్లు సాధారణంగా తగ్గుముఖం పడతాయి. కానీ 'మన శంకర వర ప్రసాద్ గారు' విషయంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా శనివారం, ఆదివారం భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అంతేకాదు, సోమవారం రిపబ్లిక్ డే జాతీయ సెలవు కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలా 'మన శంకర వర ప్రసాద్ గారు' కేవలం బాక్సాఫీస్ వసూళ్ల పరంగానే కాకుండా, ప్రాంతీయంగా షేర్ కలెక్షన్స్‌లో కూడా ఇండస్ట్రీ హిస్టరీని తిరగరాస్తోంది. రెండో వారంలోనూ వసూళ్ల జోరు కొనసాగుతుండటంతో, రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











