MSVPG Day 14 Box Office Collections: రెండో వారంలోనూ మెగాస్టార్ విధ్వంసం.. చిరూ మూవీకి ఎన్ని కోట్లంటే?
Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. విడుదలకు ముందే భారీ అంచనాలతో రంగంలోకి దిగిన ఈ చిత్రం, రిలీజ్ అయిన తొలి రోజు నుంచే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తోంది. సంక్రాంతి పండగ సీజన్ అడ్వాంటేజ్‌తో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి వచ్చిన భారీ మద్దతు సినిమాకు కీలకంగా మారింది. ముఖ్యంగా కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్‌ను చేరుకోవడం ఈ సినిమాకి ప్రత్యేకతగా నిలిచింది.ఈ నేపథ్యంలో 14వ రోజు 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
దర్శకుడు అనిల్ రావిపూడి మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను బ్యాలెన్స్ గా ప్రెజెంట్ చేయడంలో మరోసారి సక్సెస్ అయ్యారు. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచాయి. హీరోయిన్‌గా నయనతార నటించగా, గెస్ట్ అప్పియరెన్స్‌లో వెంకటేష్ కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. విడుదల అనంతరం వచ్చిన పాజిటివ్ టాక్ ఓపెనింగ్స్‌ను భారీగా పెంచింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు రూ.105 కోట్లకు, మొత్తం ఇండియా బిజినెస్ సుమారు రూ.120 కోట్లకు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ భారీ డిమాండ్ కనిపించగా, నార్త్ అమెరికా రైట్స్ సుమారు రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం.
ఈ లెక్కల ప్రకారం వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. అంత భారీ బ్రేక్‌ఈవెన్ ఉన్నప్పటికీ, స్ట్రాంగ్ ఓపెనింగ్స్‌తో పాటు తొలి వారం వసూళ్లతోనే సినిమా లాభాల బాట పట్టడం ట్రేడ్ వర్గాలకు పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది. మెగాస్టార్ కెరీర్‌లోనే మొదటి రూ.200 కోట్ల గ్రాసర్గా చరిత్ర సృష్టించింది. చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఉన్నప్పటికీ, ఈ స్థాయి కలెక్షన్స్ నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద సెకండ్ వీక్‌లోనూ దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా తొలి వారం మంచి వసూళ్లు రాబట్టడమే కాకుండా, రెండో వీకెండ్‌లో ఊహించని స్థాయిలో గ్రోత్ నమోదు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. 13 వ రోజు (రెండో శనివారం)న సినిమాకు గట్టి బూస్ట్ లభించింది. ఆ రోజు ఈ సినిమా సుమారు రూ.4.25 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. ఇదే 12వ రోజు రూ.2.65 కోట్లతో పోలిస్తే దాదాపు 60 శాతం అధికం కావడం గమనార్హం.
విడుదలైన 13 రోజుల్లో ఈ సినిమా మొత్తం రూ. 220.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి సంక్రాంతి సీజన్‌లో సెన్సేషన్‌గా మారింది. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ (APTG) నుంచే రూ. 194.2 కోట్ల గ్రాస్ రావడం విశేషం. కర్ణాటకలో రూ. 19.78 కోట్లు, తమిళనాడులో రూ. 2.79 కోట్లు, కేరళలో రూ. 0.12 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.3.86 కోట్లు వసూలు చేసింది. ఇందులో మొదటి వారంలోనే ఈ సినిమా రూ. 212.6 కోట్ల గ్రాస్ నమోదు చేసింది.
ఇక 14వ రోజు (ఆదివారం)వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ముంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. భారతీయ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.5 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశముందట. ఈ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ఆదివారం నాటికి ఈ సినిమా రూ.230 కోట్ల మార్క్‌ను దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్‌లో హయ్యెస్ట్ సంక్రాంతి గ్రాసర్ల జాబితాలో కీలక స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం కూడా స్టేబుల్ రన్ కొనసాగుతుండటంతో, ఫైనల్ కలెక్షన్స్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు కేవలం బాక్సాఫీస్ వసూళ్లలోనే కాదు, ప్రాంతీయ షేర్ కలెక్షన్స్‌లో కూడా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. రెండో వారంలోనూ సినిమా అదే జోరు కొనసాగిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా విడుదల చేసిన లేటెస్ట్ పోస్టర్‌తో మరోసారి హైప్ పెంచిన ఈ సినిమా, సీడెడ్, ఈస్ట్ గోదావరి, నెల్లూరు ప్రాంతాల్లో ఇప్పటివరకు ఏ సినిమాకీ సాధ్యం కాని స్థాయిలో అత్యధిక షేర్ కలెక్షన్స్ నమోదు చేసి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ ఊపు కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు ఈ సినిమా ఖాతాలో చేరడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











