MSVPG Day 15 Box Office Collections: ఆల్‌టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్.. చిరు మూవీకి ఎన్ని కోట్లంటే?
Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలకు ముందే భారీ అంచనాల నడుమ రంగంలోకి దిగిన ఈ సినిమా, రిలీజ్ అయిన తొలి రోజు నుంచే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తూ దూసుకుపోతోంది. సంక్రాంతి పండుగ సీజన్ అడ్వాంటేజ్‌తో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి వచ్చిన విపరీతమైన ఆదరణ సినిమాకు కీలకంగా మారింది. ముఖ్యంగా కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్‌ను చేరుకోవడం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ నేపథ్యంలో 15వ రోజు 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
దర్శకుడు అనిల్ రావిపూడి తన స్టైల్‌కు తగ్గట్లుగానే మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సమపాళ్లలో మేళవించి ఈ సినిమాను రూపొందించారు. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి నుంచి ప్రేక్షకులు కోరుకున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రావడంతో థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది. హీరోయిన్‌గా నయనతార నటించగా, గెస్ట్ అప్పియరెన్స్‌లో వెంకటేష్ కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. విడుదల అనంతరం వచ్చిన పాజిటివ్ టాక్ ఓపెనింగ్స్‌ను భారీగా పెంచడంలో కీలక పాత్ర పోషించింది.

భారీ బిజినెస్ - పెద్ద బ్రేక్‌ఈవెన్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు సుమారు రూ.105 కోట్లకు, మొత్తం ఇండియా బిజినెస్ దాదాపు రూ.120 కోట్లకు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ సినిమాకు భారీ డిమాండ్ కనిపించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా రైట్స్ సుమారు రూ.20 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.140 నుంచి 150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అంత భారీ బ్రేక్‌ఈవెన్ ఉన్నప్పటికీ, స్ట్రాంగ్ ఓపెనింగ్స్‌తో పాటు తొలి వారం వసూళ్లతోనే సినిమా లాభాల బాట పట్టడం ట్రేడ్ వర్గాలకు పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది. ముఖ్యంగా మెగాస్టార్ కెరీర్‌లోనే ఇది మొదటి రూ.200 కోట్ల గ్రాసర్‌గా చరిత్ర సృష్టించిందనే టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఉన్నప్పటికీ, ఈ స్థాయి కలెక్షన్స్ నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషంగా మారింది.
రోజు వారి కలెక్షన్స్ - స్ట్రాంగ్ ఓపెనింగ్
ఇండియా వైజ్ నెట్ కలెక్షన్స్‌ను పరిశీలిస్తే సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇండియా వైస్ గా ప్రీమియర్స్ రూ.9.35 కోట్లు రాబట్టిన ఈ సినిమా, తొలి రోజే రూ.32.25 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో అదిరిపోయే ఆరంభం ఇచ్చింది. రెండో రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు వసూలు చేస్తూ తొలి వీకెండ్ అంతా గట్టి పట్టు చూపించింది. సంక్రాంతి సెలవుల ప్రభావంతో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో నిండిపోయాయి. మొదటి వారం మొత్తం సినిమా సూపర్ స్టేబుల్‌గా కొనసాగింది. నాలుగో రోజు రూ.22 కోట్లు, ఐదో రోజు రూ.19.5 కోట్లు, ఆరో రోజు రూ.18.9 కోట్లు, ఏడో రోజు రూ.17.65 కోట్లు వసూలు చేసి మొదటి వారం స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టింది.దీంతో ఈ సినిమా పూర్తిగా సక్సెస్ రేంజ్‌లోకి వెళ్లిపోయిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
రెండో వారం కూడా అదే జోరు
రెండో వారం ప్రారంభంలో సహజంగానే కొంత స్లో అయినా, సినిమా పూర్తిగా డ్రాప్ కాలేదు. ఎనిమిదో రోజు రూ.8 కోట్లు, తొమ్మిదో రోజు రూ.5.75 కోట్లు, పదో రోజు రూ.4.2 కోట్లు, పదకొండో రోజు రూ.3.3 కోట్లు, పన్నెండో రోజు రూ.2.65 కోట్లు వసూలు చేసింది. వీక్‌డేస్‌లో కూడా డీసెంట్ నెంబర్లు నమోదు కావడం సినిమాకు ఉన్న ఫ్యామిలీ స్ట్రెంగ్త్‌ను సూచిస్తోంది. అయితే వీకెండ్‌కు మళ్లీ ఊపు రావడంతో పదమూడో రోజు రూ.4.25 కోట్లు, పద్నాలుగో రోజు రూ.6.2 కోట్లు వసూలు చేసి సినిమా స్టామినా ఏంటో మరోసారి నిరూపించిందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. మొత్తానికి 14 రోజుల్లోనే 'మన శంకర వర ప్రసాద్ గారు' భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది.
14 రోజుల్లో వరల్డ్‌వైడ్ కలెక్షన్స్
14 రోజుల బాక్సాఫీస్ ప్రయాణాన్ని పరిశీలిస్తే.. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా మొత్తం రూ.269.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇందులో ఇండియా నెట్ రూ.192.25 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.227.75 కోట్లు కాగా, ఓవర్సీస్ నుంచి రూ.41.75 కోట్లు రావడం విశేషం. దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ తెలుగు ప్రేక్షకులు సినిమాను భారీ స్థాయిలో ఆదరించారని ఈ లెక్కలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇక 15వ రోజు సోమవారం హాలీ డే కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ రోజు సుమారు రూ.4.5 నుంచి 5 కోట్ల గ్రాస్ వసూలు చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ లెక్కల ప్రకారం సోమవారం నాటికి ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.200 కోట్ల మార్క్‌ను, ఇండియా గ్రాస్ కలెక్షన్స్ రూ.230 కోట్ల మార్క్‌ను దాటడం దాదాపు ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
బాక్సాఫీస్ వసూళ్లతో పాటు ప్రాంతీయ షేర్ కలెక్షన్స్‌లో కూడా 'మన శంకర వర ప్రసాద్ గారు' సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. రెండో వారంలోనూ అదే జోరు కొనసాగించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సీడెడ్, ఈస్ట్ గోదావరి, నెల్లూరు వంటి కీలక ప్రాంతాల్లో ఇప్పటివరకు ఏ సినిమాకీ సాధ్యం కాని స్థాయిలో అత్యధిక షేర్ కలెక్షన్స్ నమోదు చేసి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డులను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా, 15వ రోజు సందర్భంగా విడుదల చేసిన లేటెస్ట్ పోస్టర్‌తో సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. 'ఆల్‌టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్! ఏడ్చే వాళ్లని ఏడవనీ...' అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా రూ.300 కోట్ల మార్క్‌ను దాటినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించడం మరింత సంచలనం సృష్టించింది. ఇలా మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా 'మన శంకర వర ప్రసాద్ గారు' నిలిచింది.


Click it and Unblock the Notifications











