MSVPG Day 16 Box Office Collections: రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్.. చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లంటే?
Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా మూవీ ' మన శంకర వర ప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి దూసుకుపోతోంది. విడుదలైన రెండు వారాలు పూర్తైనప్పటికీ సినిమా వసూళ్లలో ఎలాంటి తగ్గుదల కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంటోంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడంతో, వర్కింగ్ డేస్‌లోనూ కలెక్షన్లు స్టడీగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్‌ను చేరుకోవడం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ నేపథ్యంలో 16వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సమపాళ్లలో మేళవించి సినిమాను రూపొందించారు. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి నుంచి ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రావడంతో థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది. హీరోయిన్‌గా నయనతార నటించగా, గెస్ట్ అప్పియరెన్స్‌లో వెంకటేష్ కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. విడుదల అనంతరం వచ్చిన పాజిటివ్ టాక్ ఓపెనింగ్స్‌కు పెద్ద బలంగా మారింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా మూవీ భారీ స్థాయిలో బిజినెస్ చేసి థియేటర్లలోకి అడుగుపెట్టింది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు సుమారు రూ.105 కోట్లకు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తం ఇండియా బిజినెస్ దాదాపు రూ.120 కోట్ల వరకు చేరగా, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమాకు గట్టి డిమాండ్ కనిపించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా రైట్స్ సుమారు రూ.20 కోట్లకు అమ్ముడవడం విశేషం. ఈ లెక్కలన్నింటిని కలిపి చూస్తే, వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.140 నుంచి 150 కోట్ల మధ్య జరిగినట్లు ట్రేడ్ అంచనా వేస్తోంది.
ఇంత భారీ బ్రేక్‌ఈవెన్ ఉన్నప్పటికీ, సినిమా స్ట్రాంగ్ ఓపెనింగ్స్‌తోనే ట్రేడ్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. తొలి రోజు నుంచే వసూళ్ల సునామీ మొదలవగా, మొదటి వారంలోనే లాభాల బాట పట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఇది మెగాస్టార్ కెరీర్‌లోనే తొలి రూ.200 కోట్ల గ్రాసర్‌గా నిలిచిందనే టాక్ సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఉన్నప్పటికీ, ఈ స్థాయి కలెక్షన్లు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషంగా చెప్పుకుంటున్నారు.
ఇండియా వైజ్ నెట్ కలెక్షన్లను పరిశీలిస్తే.. సినిమా మొదటి షో నుంచే రికార్డులను షేక్ చేసినట్లు స్పష్టమవుతుంది. ప్రీమియర్స్ ద్వారానే రూ.9.35 కోట్ల నెట్ రాబట్టిన ఈ మూవీ, తొలి రోజే రూ.32.25 కోట్ల నెట్ కలెక్షన్లతో అద్భుతమైన ఆరంభం అందుకుంది. రెండో రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు వసూలు చేస్తూ తొలి వీకెండ్ మొత్తం గట్టి పట్టు చూపించింది. సంక్రాంతి సెలవుల ప్రభావంతో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో నిండిపోయాయి.
మొదటి వారం మొత్తం సినిమా సూపర్ స్టేబుల్‌గా కొనసాగింది. నాలుగో రోజు రూ.22 కోట్లు, ఐదో రోజు రూ.19.5 కోట్లు, ఆరో రోజు రూ.18.9 కోట్లు, ఏడో రోజు రూ.17.65 కోట్లు వసూలు చేసి మొదటి వారం ముగిసే సరికి సినిమా పూర్తిగా సక్సెస్ రేంజ్‌లోకి వెళ్లిపోయిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. తొలి వారం వసూళ్లే బ్రేక్‌ఈవెన్‌కు దగ్గరగా తీసుకెళ్లడం పెద్ద ప్లస్‌గా మారింది.
రెండో వారం ప్రారంభంలో సహజంగానే కొంత స్లో అయినా, సినిమా పూర్తిగా డ్రాప్ కాలేదు. ఎనిమిదో రోజు రూ.8 కోట్లు, తొమ్మిదో రోజు రూ.5.75 కోట్లు, పదో రోజు రూ.4.2 కోట్లు, పదకొండో రోజు రూ.3.3 కోట్లు, పన్నెండో రోజు రూ.2.65 కోట్లు వసూలు చేసింది. వీక్‌డేస్‌లో కూడా డీసెంట్ నెంబర్లు నమోదు కావడం సినిమాకు ఉన్న ఫ్యామిలీ స్ట్రెంగ్త్‌ను స్పష్టంగా చూపించింది. ఇక వీకెండ్ రాగానే మళ్లీ ఊపు వచ్చింది. పదమూడో రోజు రూ.4.25 కోట్లు, పద్నాలుగో రోజు రూ.6.2 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు కాగా, వీకెండ్ ముగిసిన తర్వాత కూడా 15వ రోజు రూ.5.09 కోట్ల నెట్ వసూళ్లు సాధించడం విశేషంగా మారింది.
మొత్తం కలెక్షన్ల పరంగా సినిమా ఇప్పటికే భారీ మైలురాయిని చేరుకుంది. తాజా ట్రేడ్ రిపోర్టుల ప్రకారం..15 రోజుల్లో సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.269.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇండియా నెట్ కలెక్షన్లు రూ.197.34 కోట్లుగా ఉండగా, ఇండియా గ్రాస్ రూ.227.75 కోట్లకు చేరింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మెగాస్టార్ మార్కెట్ స్ట్రాంగ్ కలెక్షన్స్ సాధిస్తుంది. విదేశీ మార్కెట్ల నుంచి ఇప్పటివరకు రూ.41.75 కోట్ల గ్రాస్ వసూలు కావడం విశేషం.
ఇక ప్రాంతాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్- తెలంగాణ నుంచి రూ.200.35 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ద్వారా సినిమా విజయానికి వెన్నెముకగా మారింది. కర్ణాటక మార్కెట్‌లో రూ.20.5 కోట్ల గ్రాస్ రాబట్టగా, తమిళనాడు నుంచి రూ.2.84 కోట్ల వసూళ్లు వచ్చాయి. కేరళలో కూడా పరిమిత థియేటర్లలో విడుదలైనప్పటికీ రూ.3.94 కోట్ల గ్రాస్ సాధించింది. ఇలా 15 రోజుల్లో మొత్తం ఇండియా గ్రాస్ రూ.227.75 కోట్లకు చేరింది. ఇక మన శంకర వర ప్రసాద్ గారు మూవీ 16 రోజు కలెక్షన్స్ కాస్త తగ్గే అవకాశముంది. కేవలం రూ. 3 నుంచి 3.5 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాల అంచనా.
ఇదిలా ఉంటే.. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు విడుదలైన కేవలం 15 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ. 358 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని, ఆల్‌టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని మూవీ మేకర్స్ ప్రకటించారు. మొత్తంగా చూస్తే, 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవడమే కాకుండా, 2026 బాక్సాఫీస్‌ను శాసించిన మూవీగా రికార్డు క్రియేట్ చేయబోతున్నదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











