MSVPG Day 17 Box Office Collections: వర ప్రసాద్ గారు షాకింగ్ కలెక్షన్లు.. చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లంటే?
Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన లెటెస్ట్ మూవీ 'మన శంకర వర ప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి దూసుకుపోతోంది. విడుదలై రెండు వారాలు పూర్తైనా వసూళ్లలో ఎలాంటి తగ్గుదల లేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ కూడా థియేటర్లకు భారీగా రావడంతో వర్కింగ్ డేస్‌లోనూ కలెక్షన్లు స్టడీగా కొనసాగుతున్నాయి. కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్‌ను చేరుకోవడం సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ నేపథ్యంలో 17వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
దర్శకుడు అనిల్ రావిపూడి మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను బ్యాలెన్స్ చేయడం సినిమాకు ప్లస్ అయ్యింది. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. హీరోయిన్‌గా నయనతార నటించగా, గెస్ట్ అప్పియరెన్స్‌లో వెంకటేష్ కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

ట్రేడ్ సమాచారం ప్రకారం సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగురాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు సుమారు రూ.105 కోట్లకు క్లోజ్ కాగా, వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. స్ట్రాంగ్ ఓపెనింగ్స్‌తోనే తొలి వారంలో లాభాల బాట పట్టిన ఈ చిత్రం, మెగాస్టార్ కెరీర్‌లోనే తొలి రూ.200 కోట్ల గ్రాసర్‌గా నిలిచిందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
మన శంకర వర ప్రసాద్ గారు సినిమా తొలి షో నుంచే బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రీమియర్స్ ద్వారానే రూ.9.35 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ మూవీ, మొదటి రోజే రూ.32.25 కోట్ల నెట్ కలెక్షన్లతో అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. రెండో రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు రాబట్టడంతో తొలి వీకెండ్ మొత్తం గట్టి పట్టు కొనసాగింది. సంక్రాంతి సెలవుల ప్రభావంతో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో నిండిపోయి, సినిమా ప్రారంభ దశలోనే భారీ మోమెంటమ్ సంపాదించింది.
మొదటి వారం మొత్తం సినిమా సూపర్ స్టేబుల్‌గా కొనసాగింది. నాలుగో రోజు రూ.22 కోట్లు, ఐదో రోజు రూ.19.5 కోట్లు, ఆరో రోజు రూ.18.9 కోట్లు, ఏడో రోజు రూ.17.65 కోట్లు వసూలు చేసి, తొలి వారం ముగిసే సరికి సినిమా పూర్తిగా సక్సెస్ రేంజ్‌లోకి వెళ్లిపోయిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ముఖ్యంగా తొలి వారం వసూళ్లే దాదాపుగా బ్రేక్‌ఈవెన్‌కు దగ్గరగా తీసుకెళ్లడం సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడం ఈ స్టేబిలిటీకి ప్రధాన కారణంగా మారింది.
రెండో వారం ప్రారంభంలో సహజంగా కొంత స్లో కనిపించినప్పటికీ, సినిమా పూర్తిగా డ్రాప్ కాలేదు. ఎనిమిదో రోజు రూ.8 కోట్లు, తొమ్మిదో రోజు రూ.5.75 కోట్లు, పదో రోజు రూ.4.2 కోట్లు, పదకొండో రోజు రూ.3.3 కోట్లు, పన్నెండో రోజు రూ.2.65 కోట్లు వసూలు చేసింది. వీక్‌డేస్‌లో కూడా ఈ స్థాయి నెంబర్లు నమోదు కావడం సినిమాకు ఉన్న ఫ్యామిలీ స్ట్రెంగ్త్‌ను స్పష్టంగా చూపించింది. వీకెండ్ రాగానే మళ్లీ ఊపు పెరిగి, పదమూడో రోజు రూ.4.25 కోట్లు, పద్నాలుగో రోజు రూ.6.2 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదయ్యాయి. అంతేకాదు, వీకెండ్ అనంతరం కూడా 15వ రోజు రూ.5.09 కోట్లు, 16వ రోజు రూ.2.1 కోట్ల నెట్ వసూళ్లు సాధించడం ట్రేడ్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.
మొత్తం కలెక్షన్ల పరంగా చూస్తే సినిమా ఇప్పటికే భారీ మైలురాయిని చేరుకుంది. తాజా ట్రేడ్ రిపోర్టుల ప్రకారం 16 రోజుల్లో సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.278.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇండియా నెట్ కలెక్షన్లు రూ.199.34 కోట్లుగా ఉండగా, ఇండియా గ్రాస్ రూ.236.35 కోట్లకు చేరింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మెగాస్టార్ క్రేజ్ మరోసారి రుజువైంది. యూఎస్‌తో పాటు ఇతర దేశాల నుంచి ఇప్పటివరకు రూ.42.15 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ ట్రాకర్స్ వెల్లడించారు.
ప్రాంతాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్- తెలంగాణ నుంచి మాత్రమే రూ.207.95 కోట్ల గ్రాస్ రావడం తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి మార్కెట్ ఎంత బలంగా ఉందో చూపిస్తోంది. కర్ణాటక మార్కెట్‌లో రూ.21.23 కోట్ల గ్రాస్ రాగా, తమిళనాడు నుంచి రూ.2.9 కోట్లు, కేరళ, ఇతర ప్రాంతాల నుంచి రూ.4.10 కోట్ల గ్రాస్ వసూలైంది. ఈ లెక్కలన్నింటిని కలిపితే ఇండియా గ్రాస్ రూ.236.25 కోట్లకు చేరగా, ఓవర్సీస్ కలిపి వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.278.5 కోట్లుగా నమోదైంది.
ఇక ట్రేడ్ అంచనాల ప్రకారం 17వ రోజు నుంచి వసూళ్లు కొంత తగ్గే అవకాశముంది. ఆ రోజు నెట్ కలెక్షన్లు రూ.2.5 నుంచి రూ.3 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, మేకర్స్ మాత్రం సినిమా కేవలం 15 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.358 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్‌టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని ప్రకటించడం మరో చర్చకు దారి తీసింది. మొత్తంగా చూస్తే, 'మన శంకర వర ప్రసాద్ గారు' చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవడమే కాకుండా, 2026 బాక్సాఫీస్‌ను శాసించే చిత్రంగా మారబోతోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











