MSVPG Day 18 Box Office Collections: తగ్గని శంకర వరప్రసాద్ బాక్సాఫీస్ హవా.. చిరు మూవీకి ఎన్ని కోట్లంటే?

Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'మన శంకర వర ప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది. విడుదలై రెండు వారాలు పూర్తైనా కలెక్షన్లలో తగ్గుదల కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వర్కింగ్ డేస్‌లోనూ కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ థియేటర్లకు భారీగా తరలివస్తుండటంతో వసూళ్లు స్టడీగా కొనసాగుతున్నాయి. ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్ చేరుకోవడం సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. ఈ నేపథ్యంలో 18వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

దర్శకుడు అనిల్ రావిపూడి మాస్ ఎలిమెంట్స్‌కు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సమతుల్యం చేయడం సినిమాను హిట్ ట్రాక్‌లో నిలిపింది. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్‌గా నయనతార నటించగా, గెస్ట్ అప్పియరెన్స్‌లో వెంకటేష్ కనిపించడం సినిమాపై బజ్‌ను మరింత పెంచింది.

Chiranjeevi movie Mana Shankara Varaprasad Garu Day 18 Expected Box Office Collections Worldwide

ట్రేడ్ అంచనాల ప్రకారం సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగురాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు సుమారు రూ.105 కోట్లకు క్లోజ్ కాగా, వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగింది. స్ట్రాంగ్ ఓపెనింగ్స్‌తో తొలి వారంలోనే లాభాల బాట పట్టిన ఈ మూవీ, మెగాస్టార్ కెరీర్‌లో తొలి రూ.200 కోట్ల నెట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా ట్రేడ్‌లో కొత్త మైలురాయిని సృష్టించింది.

ఇక మన శంకర వర ప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద తొలి షో నుంచే రికార్డులను షేక్ చేస్తూ దూసుకుపోతోంది. సినిమా రిలీజైన మొదటి రోజే ట్రేడ్ వర్గాలకు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చిన ఈ మూవీ, ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమా రూ.9.35 కోట్ల నెట్ వసూలు చేయడం విశేషం. ఇక ఫస్ట్ డే మొత్తం రూ.32.25 కోట్ల నెట్ కలెక్షన్లతో స్ట్రాంగ్ ఓపెనింగ్ నమోదు చేసింది. రెండో రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు వసూలు చేయడంతో తొలి వీకెండ్ మొత్తం సినిమాకు స్ట్రాంగ్ మోమెంటమ్ లభించింది. సంక్రాంతి సెలవుల ప్రభావంతో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో నిండిపోవడం కలెక్షన్లకు మరింత బలం చేకూర్చింది.

మొదటి వారం మొత్తం సినిమా సూపర్ స్టేబుల్‌గా కొనసాగింది. నాలుగో రోజు రూ.22 కోట్లు, ఐదో రోజు రూ.19.5 కోట్లు, ఆరో రోజు రూ.18.9 కోట్లు, ఏడో రోజు రూ.17.65 కోట్లు వసూలు చేసి, తొలి వారం ముగిసే సరికి బ్రేక్‌ఈవెన్‌కు చాలా దగ్గరగా చేరుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడం ఈ స్థిరమైన వసూళ్లకు ప్రధాన కారణంగా ట్రేడ్ విశ్లేషిస్తోంది.

రెండో వారం ప్రారంభంలో సహజంగా కొంత డ్రాప్ కనిపించినప్పటికీ, సినిమా పూర్తిగా పడిపోలేదు. ఎనిమిదో రోజు రూ.8 కోట్లు, తొమ్మిదో రోజు రూ.5.75 కోట్లు, పదో రోజు రూ.4.2 కోట్లు, పదకొండో రోజు రూ.3.3 కోట్లు, పన్నెండో రోజు రూ.2.65 కోట్లు వసూలు చేసింది. వీక్‌డేస్‌లోనూ ఈ స్థాయి నెంబర్లు రావడం సినిమాకు ఉన్న ఫ్యామిలీ స్ట్రెంగ్త్‌ను మరోసారి నిరూపించింది. వీకెండ్ వచ్చేసరికి మళ్లీ ఊపు పెరిగింది. పదమూడో రోజు రూ.4.25 కోట్లు, పద్నాలుగో రోజు రూ.6.2 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదయ్యాయి.

అంతేకాదు, వీకెండ్ తర్వాత కూడా సినిమా స్టామినా చూపించింది. 15వ రోజు రూ.5.09 కోట్లు, 16వ రోజు రూ.2.1 కోట్లు, 17వ రోజు రూ.1.16 కోట్ల నెట్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే, 17 రోజుల్లో సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.280.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇందులో ఇండియా నెట్ కలెక్షన్లు రూ.200.51 కోట్లుగా ఉండగా, ఇండియా గ్రాస్ రూ.238.35 కోట్లకు చేరింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా చిరంజీవి క్రేజ్ మరోసారి రుజువైంది. అమెరికా సహా ఇతర దేశాల నుంచి ఇప్పటివరకు రూ.42.15 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ ట్రాకర్స్ వెల్లడించారు.

ఇక 18వ రోజు కలెక్షన్లపై ట్రేడ్ అంచనాలు కొంత తగ్గుముఖం పడుతున్నాయి. ఆ రోజు నెట్ వసూళ్లు రూ.2 నుంచి రూ.2.5 కోట్ల మధ్య ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా, మేకర్స్ మాత్రం సినిమా కేవలం 15 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.388 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్‌టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని ప్రకటించడం మరో చర్చకు దారి తీసింది. ఇలా 'మన శంకర వర ప్రసాద్ గారు' మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మరో ఘన విజయంగా నిలవడమే కాకుండా, 2026 బాక్సాఫీస్‌ను శాసించే చిత్రాల్లో ఒకటిగా మారబోతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X