MSVPG Day 20 Box Office Collections: వీకెండ్ లో ఊపందుకున్న శంకర వరప్రసాద్.. చిరు మూవీకి ఎన్ని కోట్లంటే?

Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన లెటెస్ట్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి దూసుకుపోతోంది. విడుదలై రెండు వారాలు పూర్తయినా వసూళ్లలో ఎలాంటి తగ్గుదల కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా వర్కింగ్ డేస్‌లోనూ కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ థియేటర్లకు పెద్ద సంఖ్యలో రావడంతో కలెక్షన్లు స్టడీగా కొనసాగుతున్నాయి. విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్ చేరుకోవడం సినిమాకు కీలక ప్లస్‌గా మారింది. ముఖ్యంగా నెట్ కలెక్షన్ల పరంగా రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన చిరంజీవి తొలి చిత్రంగా ట్రేడ్‌లో ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో 20వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను బ్యాలెన్స్ చేశారు. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కథానాయికగా నయనతార నటించగా, గెస్ట్ అప్పియరెన్స్‌లో వెంకటేష్ కనిపించడం సినిమాపై బజ్‌ను మరింత పెంచింది.

Chiranjeevi movie Mana Shankara Varaprasad Garu Day 20 Expected Box Office Collections Worldwide

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ-రిలీజ్ దశలోనే భారీ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.105 కోట్లకు అమ్ముడవ్వగా, వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్యలో జరిగింది. స్ట్రాంగ్ ఓపెనింగ్స్‌తో తొలి వారంలోనే లాభాల బాట పట్టిన ఈ మూవీ, కలెక్షన్ల పరంగా మెగాస్టార్ కెరీర్‌లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.

మన శంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద తొలి షో నుంచే రికార్డులను షేక్ చేస్తూ దూసుకుపోతోంది. విడుదలకు ముందే భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా, రిలీజ్ అయిన మొదటి రోజే ట్రేడ్ వర్గాలకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ముఖ్యంగా ప్రీమియర్స్ ద్వారానే రూ.9.35 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడం విశేషంగా నిలిచింది. ఇక ఫస్ట్ డే మొత్తం రూ.32.25 కోట్ల నెట్ కలెక్షన్లతో స్ట్రాంగ్ ఓపెనింగ్ నమోదు చేసి, మెగాస్టార్ మార్కెట్ స్టామినాను మరోసారి రుజువు చేసింది.

రెండో రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు వసూలు చేయడంతో సినిమాకు తొలి వీకెండ్ నుంచే మంచి మోమెంటమ్ లభించింది. సంక్రాంతి సెలవుల ప్రభావంతో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో నిండిపోవడం కలెక్షన్లకు మరింత బలాన్ని చేకూర్చింది. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలిరావడం సినిమాకు ప్లస్‌గా మారింది.

మొదటి వారం మొత్తం సినిమా సూపర్ స్టేబుల్‌గా కొనసాగింది. నాలుగో రోజు రూ.22 కోట్లు, ఐదో రోజు రూ.19.5 కోట్లు, ఆరో రోజు రూ.18.9 కోట్లు, ఏడో రోజు రూ.17.65 కోట్లు వసూలు చేయడంతో తొలి వారం ముగిసే సరికి బ్రేక్‌ఈవెన్‌కు చాలా దగ్గరగా చేరుకుంది. వర్కింగ్ డేస్‌లోనూ ఈ స్థాయి వసూళ్లు రావడం సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ స్ట్రెంగ్త్‌ను స్పష్టంగా చూపించిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

రెండో వారం ప్రారంభంలో సహజంగా కొంత డ్రాప్ కనిపించినా, సినిమా పూర్తిగా పడిపోలేదు. ఎనిమిదో రోజు రూ.8 కోట్లు, తొమ్మిదో రోజు రూ.5.75 కోట్లు, పదో రోజు రూ.4.2 కోట్లు, పదకొండో రోజు రూ.3.3 కోట్లు, పన్నెండో రోజు రూ.2.65 కోట్లు వసూలు చేసింది. వీక్‌డేస్‌లోనూ ఈ స్థాయి నెంబర్లు రావడం సినిమాకు ఉన్న లాంగ్ రన్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. వీకెండ్ వచ్చేసరికి మళ్లీ కలెక్షన్లలో ఊపు కనిపించింది. పదమూడో రోజు రూ.4.25 కోట్లు, పద్నాలుగో రోజు రూ.6.2 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి.

వీకెండ్ తర్వాత కూడా సినిమా స్టామినా తగ్గలేదు. 15వ రోజు రూ.5.09 కోట్లు, 16వ రోజు రూ.2.1 కోట్లు, 17వ రోజు రూ.1.16 కోట్లు, 18వ రోజు రూ.1.3 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రాంతాల వారిగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో రూ.212.05 కోట్లు, కర్ణాటకలో రూ.21.44 కోట్లు, తమిళనాడులో రూ.2.93 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.4.11 కోట్లు వసూలు చేసి, ఇండియా గ్రాస్ మొత్తం రూ.240.65 కోట్లకు చేరింది.

మొత్తంగా 19 రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.282.8 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇందులో ఇండియా నెట్ కలెక్షన్లు రూ.203.05 కోట్లు కాగా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మెగాస్టార్ క్రేజ్ మరోసారి రుజువైంది. అమెరికా సహా ఇతర దేశాల నుంచి ఇప్పటివరకు సుమారు రూ.43 కోట్ల గ్రాస్ వసూలైనట్లు సమాచారం. ఇక 20వ రోజు వీకెండ్ కావడంతో కలెక్షన్లు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రోజు నెట్ వసూళ్లు రూ.3 నుంచి రూ.3.5 కోట్ల మధ్య ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు.

ఇదిలా ఉండగా, మేకర్స్ మాత్రం సినిమా కేవలం 15 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.388 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్‌టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని ప్రకటించారు. వీకెండ్‌లో కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగితే, ఈ సినిమా త్వరలోనే రూ.400 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా 'మన శంకర వర ప్రసాద్ గారు' మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మరో ఘన విజయంగా నిలవడమే కాకుండా, 2026 బాక్సాఫీస్‌ను రికార్డు తిరగరాసే సినిమాల్లో ఒకటిగా మారబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X