MSVPG Day 21 Box Office Collections: మెగాస్టార్ ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ .. చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లంటే?

Mana Shankara Vara Prasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద ఊహలను మించి దూసుకుపోతోంది. విడుదలై రెండు వారాలు పూర్తైనప్పటికీ వసూళ్లలో తగ్గుదల లేకుండా స్టడీగా కొనసాగుతుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా వర్కింగ్ డేస్‌లోనూ కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ థియేటర్లకు భారీగా రావడం సినిమాకు బలంగా మారింది. రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్ చేరుకోవడం ఈ మూవీకి ప్లస్. ఈ నేపథ్యంలో 21వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను బ్యాలెన్స్ గా మలిచారు. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కథానాయికగా నయనతార నటించగా, గెస్ట్ అప్పియరెన్స్‌లో వెంకటేష్ కనిపించడం సినిమాపై బజ్‌ను మరింత పెంచింది.

Chiranjeevi movie Mana Shankara Varaprasad Garu Day 21 Expected Box Office Collections Worldwide

సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ దశలోనే భారీ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.105 కోట్లకు అమ్ముడవ్వగా, వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య నమోదైంది. స్ట్రాంగ్ ఓపెనింగ్స్‌తో తొలి వారంలోనే లాభాల బాట పట్టిన ఈ మూవీ, కలెక్షన్ల పరంగా మెగాస్టార్ కెరీర్‌లో మరో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది.

మన శంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద తొలి షో నుంచే రికార్డులను షేక్ చేస్తూ దూసుకుపోతోంది. విడుదలకు ముందే భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, రిలీజ్ డే నుంచే ట్రేడ్ వర్గాలకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రీమియర్స్ ద్వారానే రూ.9.35 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం కాగా, ఫస్ట్ డే మొత్తం రూ.32.25 కోట్ల నెట్ కలెక్షన్లతో స్ట్రాంగ్ ఓపెనింగ్ నమోదు చేసి మెగాస్టార్ మార్కెట్ స్టామినాను మరోసారి రుజువు చేసింది.

రెండో రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు వసూలు చేయడంతో సినిమాకు తొలి వీకెండ్ నుంచే స్ట్రాంగ్ మోమెంటమ్ అందుకుంది. అలాగే..సంక్రాంతి సెలవుల ప్రభావంతో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో నిండిపోవడం కలెక్షన్లకు మరింత ఊపునిచ్చింది. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలిరావడం సినిమాకు కీలక ప్లస్‌గా మారింది.

మొదటి వారం మొత్తం సినిమా సూపర్ స్టేబుల్‌గా కొనసాగింది. నాలుగో రోజు రూ.22 కోట్లు, ఐదో రోజు రూ.19.5 కోట్లు, ఆరో రోజు రూ.18.9 కోట్లు, ఏడో రోజు రూ.17.65 కోట్లు వసూలు చేయడంతో తొలి వారం ముగిసే సరికి బ్రేక్‌ఈవెన్‌కు చాలా దగ్గరగా చేరుకుంది. వర్కింగ్ డేస్‌లోనూ ఈ స్థాయి వసూళ్లు రావడం సినిమాలోని ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ స్ట్రెంగ్త్‌ను స్పష్టంగా చూపించిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

రెండో వారం ప్రారంభంలో సహజంగా కొంత డ్రాప్ కనిపించినా, సినిమా పూర్తిగా పడిపోలేదు. ఎనిమిదో రోజు రూ.8 కోట్లు, తొమ్మిదో రోజు రూ.5.75 కోట్లు, పదో రోజు రూ.4.2 కోట్లు, పదకొండో రోజు రూ.3.3 కోట్లు, పన్నెండో రోజు రూ.2.65 కోట్లు వసూలు చేసింది. వీక్‌డేస్‌లోనూ ఈ నెంబర్లు రావడం సినిమాకు ఉన్న లాంగ్‌రన్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. వీకెండ్ వచ్చేసరికి మళ్లీ ఊపు పెరిగి, పదమూడో రోజు రూ.4.25 కోట్లు, పద్నాలుగో రోజు రూ.6.2 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి.

వీకెండ్ తర్వాత కూడా స్టామినా తగ్గలేదు. 15వ రోజు రూ.5.09 కోట్లు, 16వ రోజు రూ.2.1 కోట్లు, 17వ రోజు రూ.1.16 కోట్లు, 18వ రోజు రూ.1.3 కోట్లు, 19వ రోజు రూ.1.1 కోట్లు, 20వ రోజు రూ.2.04 కోట్లు (నెట్) వసూలు చేసినట్లు సక్ నిల్క్ పేర్కొంది. ఇలా 20 రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.285.8 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇందులో ఇండియా నెట్ రూ.205.09 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.240.65 కోట్లు కాగా, ఓవర్సీస్‌లో సుమారు రూ.43 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం.

ఇక 21వ రోజు వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వేస్తున్నాయి. ఆదివారం నాడు ఇండియా వైడ్‌గా రూ.3-3.5 కోట్ల నెట్ రావచ్చని అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, మేకర్స్ మాత్రం 20 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.410 కోట్ల గ్రాస్ సాధించి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పిందని అధికారికంగా ప్రకటించారు. దేశీయంగా, ఓవర్సీస్‌లోనూ సాలిడ్ కలెక్షన్లతో దూసుకెళ్లుతున్న ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త మైలురాయిగా నిలిచింది. మొత్తంగా 'మన శంకర వర ప్రసాద్ గారు' మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మరో ఘన విజయం సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X